ఉదయం నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు . ఎందుకు?

0
115

మానవుని శాస్త్ర జ్ఞానము అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఋషులు , మునునులు ఆన్ని అరోగ్య సూత్రాలను ఆత్యాద్మికము గా రూపొందించారు . ప్రజల్లో దేవుడిపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని పలు ఆరోగ్య నియమాల్లో దైవత్వం ఉందని అలా చేయాలని నమ్మించారు. ఆ నమ్మకమే ప్రజలను రోగాలకు దూరం చేసింది. పూర్వం ఋషులు , మునునులు సూచించిన నియమాల్లో శాస్త్రీయ కోణం ఉండి అది మన ఆరోగ్యాన్ని కాపాడిందని ఇటీవల లండన్ పరిశోధకులు చేసిన పరిశోధనలో వెల్లడైంది.. పూర్వం సూచించిన నియమాలను పాటించాలని పరిశోధకులు ఘంఠా బజాయించి చెబుతున్నారు.

వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందని కాలంలో శుచి , శుభ్రత , వ్యాధి నిరోధకత అన్నీ దైవ కార్యాలరూపములకు లింక్ పెట్టి అప్పటి రుషులు ప్రజల్లో ఆరోగ్య నియమాలను అమలు చేయించారు. . పుణ్యము , పురుషార్ధము వస్తుందంటే సామాన్యప్రజలు ఆనురిస్తాననేదే ఇందులో ముఖ్యాంశం .  అది చేస్తే ఆరోగ్యం… ఇది చేస్తే అనారోగ్యం.. అలా చెబితే చాదస్తము గా  ప్రజలందరూ కొట్టిపారేస్తారు. కానీ దేవుడిని భాగం చేసి సూచిస్తే  చేసేస్తారు. రుషులు సూచించిన నిబంధనల్లో ఎంతో ఆరోగ్యము , ఉత్సాహం దాగిఉన్నాయి.

*నిద్రలేవగానే రెండుచేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతులలో్ని ఉష్ణశక్తి , వేడి కళ్ళకు తగిలి కళ్ళలోని రక్త ప్రసరణ ఎక్కువై ఆరోగ్యవంతంగా తేజోవంతంగా ఉంటాయి. కళ్ళజబ్బులకు దూరంగా ఉండవచ్చును . కళ్ళ అద్దాల అవసము అంత తొందరగా రాదు . ఇది వైద్యశాస్త్రము చెప్పిన ఆరోగ్యసూత్రము .

కాని రుషులు ఏమిచెప్పారు … చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండా చూడడం ద్వారా బ్రహ్మను పూజించినంత ఫలితం ఉంటుందని , బ్రహ్మజ్ఞానము కలుగుతుందని … అలా ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము సంప్రాప్తిస్తుందని లింకు పెట్టేరు . ఇలాగైనా చేతులను చూస్తూ ప్రజలు ఆరోగ్యవంతులవుతారని నాటి రుషుల నమ్మకం.. అదీ అందులోని శాస్త్రీయ కోణం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here