వాట్సాప్ లో మరో మూడు కొత్త ఫీచర్లు

0
155

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉన్నది. ఇప్పటికే వీడియో కాలింగ్‌, వాయిస్‌ కాలింగ్‌, స్టేటస్‌ ఫీచర్లు ఉన్న యాప్‌లో కొద్ది రోజుల క్రితం డిలీట్‌ ఆప్షన్‌ వచ్చింది. అందులో భాగంగానే త్వరలో మరో మూడు ఫీచర్లను అందివ్వనుంది. వాటిలో ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌, షేక్‌ టు రిపోర్ట్‌, ప్రైవేట్‌ రిప్లైస్‌ ఫీచర్లు ఉన్నాయి.

 

 

 

 

 

ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌.. 

వాట్సాప్‌ ఎవరినైనా బ్లాక్‌ చేయాలంటే సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లాక్‌ చేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్‌ను అన్‌బ్లాక్‌ చేయాలంటే.. మళ్లీ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కానీ ఈ ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌ ఆప్షన్‌తో కేవలం నెంబర్‌పై లాంగ్ ప్రెస్‌ చేస్తే అన్‌బ్లాక్‌ అవుతుంది.

 

షేక్‌ టు రిపోర్ట్‌ ..

వాట్సాప్‌లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే …ఒక్కోసారి మెసేజ్‌లు వెళ్లవు.. రావు. వాటి గురించి మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి ఇన్ఫాం చేయాలంటే.. జస్ట్‌ మన ఫోన్‌ని షేక్‌ చేస్తే చాలు. కాంటాక్ట్‌ లిస్ట్‌ ఓపెన్‌ కావడంతో పాటు .. ఓ ఆప్షన్‌ వస్తుంది. అందులో సమస్యేంటో వివరించి అందరికీ ఒకేసారి పోస్ట్‌ చేస్తే చాలు.

ప్రైవేట్‌ రిప్లైస్‌ ..

వాట్సాప్‌లో మనం గ్రూప్‌ మెసేజ్‌లు చేస్తుంటాం. గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్‌ చేసినా అది అందరికీ వెళుతుంది. ప్రైవేట్‌గా మెసేజ్‌ పంపాలంటే వేరుగా కాంటాక్ట్‌ ఓపెన్‌ చేసిమెసేజ్‌ పంపాలి. అలా కాకుండా గ్రూప్‌లోనే ఉండి మనం మెసేజ్‌ పంపాలనుకునే వ్యక్తికి ప్రైవేట్‌గానే మెసేజ్‌ పంపొచ్చు. మెసేజ్‌ టైప్‌ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవేట్‌ రిప్లై ఆప్షన్‌ నొక్కితే చాలు.

ఈ కొత్త ఫీచర్లన్నీ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here