సన్నగా ఉన్నవారు ఇవి తీసుకుంటే మీ బరువును పెంచుకోవచ్చు.

0
170

అవును శరీర బరువు పెరగాలంటే అధికంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి కానీ, ఎంచుకునే ఆహర పదార్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎలాంటి కేలోరీలను అందించని ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవటం వలన మన ఆరోగ్యమే పాడవుతుంది.
పోషక విలువలను అధికంగా కలిగి ఉండి, అధిక కేలోరీలను కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. రోజు తీసుకునే దాని కన్నా 500 నుండి 1000 కేలోరీలను అదనంగా తీసుకోవటం వలన ఆరోగ్యకర బరువు పెరుగుతుంది. మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఆరోగ్యకర కొవ్వు, నాణ్యత గల ప్రోటీన్ లను మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉండాలి.

పాల ఉత్పతులు

బరువు పెరగటానికి అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహార పదార్థాలుగా వీటిని పేర్కొనవచ్చు. పాల నుండి ప్రోటీన్ మరియు కాల్షియంలను పొందుతారు. చీస్ మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యకర శరీర బరువును పెంచుతాయి.

నట్స్

ఒక పిడికెడు నట్స్ నుండి కొన్ని వందల ఆరోగ్యకర కేలోరీలను పొందుతారు. ఇవి ప్రోటీన్, విటమిన్ ‘E’ మరియు ఫైబర్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. వీటిని సలాడ్ లతో, భోజనంలో లేదా స్నాక్స్ గా కూడా తినవచ్చు. పీ నట్ బటర్ కూడా అధిక మొత్తంలో కేలోరీలను కలిగి ఉంటుంది కావున సలాడ్, సాండ్విచ్, టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ లను నట్స్ తో కలిపి తీసుకోవటం వలన బ్రేక్ఫాస్ట్ లో మంచి పోషకాలను పొందినవారవుతారు. సగం కప్పు రెసిన్ లు 200 కేలోరీలతో పాటూ విటమిన్, మినరల్ మరియు ఫైబర్ లను కలిగి ఉంటాయి. వీటిని సాయంత్రపు సమయంలో స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు.

ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు

ఆలివ్ ఆయిల్, కానోలా ఆయిల్, సోయా ఆయిల్, ఆవాల నూనె మరియు కొబ్బరి నూనె లలో కొవ్వు పదార్థాలను కలిగి ఉండే ఆహార పదార్థాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇవి మన గుండెకు చాలా ఆరోగ్యకరం మరియు ఒక చెంచా నూనెలో 45 కేలోరీలను కలిగి ఉంటాయి. హోల్ వీట్ బ్రెడ్ లను వీటిలో ముంచుకొని తినవచ్చు లేదా సలాడ్ లలో కలుపుకొని తినటం వలన అదనపు కేలోరీలను పొందినవారవుతారు.

పండ్ల రసాలు

ఆహరం తీసుకోవటం కన్నా ద్రావణాల ద్వారా అదనపు కేలోరీలను పొంది అదనపు కొవ్వు పదార్థాలను పొందవచ్చు. తాజా మరియు స్వచ్చమైన పండ్ల రసాలను తాగటం వలన ఆరోగ్యకర బరువు పెరుగుతుంది. ఒక గ్లాసు పండ్ల రసం 100 కంటే అధిక కేలోరీలను కలిగి ఉంటుంది. వీటి నుండి శరీరానికి మంచి విటమిన్ లు అందటమే కాకుండా, అధిక మొత్తంలో కెలోరీలు కూడా అందించబడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here