వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ మూవీ చూసి ఇచ్చిన జెన్యూన్ రివ్యూ 

0
363

ఫిదా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ సినిమా తొలి ప్రేమ టైటిల్ తో ముందుకు వస్తున్నాడు. వెంకీ అట్లూరి అనే యువ దర్శకుడితో సినిమా తీసిన వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.  ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా అంచనాలు అందుకుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే..

* కథ ఏంటంటే..

ఎప్పుడో విడిపోయిన ప్రేమ జంట చాలా రోజుల తర్వాత కలుసుకొని ప్రేమను బతికించారా లేదా అన్నదే మెయిన్ థీమ్.. లండన్ లో ఉండే వరుణ్ తేజ్ తన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుంటాడు. ఇంటర్ చదివే రోజుల్లో రైల్లో ప్రయాణిస్తుండగా హీరోయిన్ రాశిఖన్నాను చూసి ప్రేమలో పడతాడు. చూడగానే  ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఆదిత్యను ఇష్టపడుతుంది. ఇద్దరూ మంచి ప్రేమ పక్షులుగా ఉన్న సమయంలో అనుకోని పరిస్థితుల కారణంగా విడిపోతారు. ఓ చిన్న ట్విస్ట్ వల్ల మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత కలుస్తారు. ఇంతకీ ఆదిత్య, వర్ష ఎందుకు విడిపోయారు? వారు మళ్లీ కలిశారా? వారి ప్రేమను నిలబెట్టుకుంటారా అన్నది సినిమా కథ..

* సినిమా ఎలా ఉందంటే..

ఫిదా సినిమా ఇచ్చిన జోష్ తో వరుణ్ తేజ్ ఇందులో ప్రేమికుడిగా 100శాతం పాత్రకు ప్రాణం పోశాడు. లవ్ ఫీల్ ను తెరపై బాగా చూపించాడు. ఇక రాశిఖన్నా చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో అద్భుతంగా చేసింది. చిలిపి చూపులు, నవ్వులతో ఆకట్టుకుంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వచ్చాయి. లవ్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.. మిగతా పాత్రలన్నీ సినిమా కథలో భాగంగానే వస్తుంటాయి. దీంతో ఎక్కడా సాగదీసిన ఫీలింగ్ కలుగదు.

మంచి ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇప్పుడు వరుణ్ తేజ్ తొలి ప్రేమ కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఆ టైటిల్ కు పూర్తి న్యాయం చేశాడు దర్శకుడు వెంకీ. ఈ సినిమాలో ఇద్దరు విడిపోయిన సందర్భంగా బలంగా ఉన్నా అది ఆడియెన్స్ ను మెప్పించేలా ఉండదు.. అదొక్కటే కాస్త లోటు. ఓవరాల్ గా సినిమాను చూశాక మంచి అనుభూతిని అయితే ప్రేక్షకుడు పొందేలా తీర్చిదిద్దారు.

ఫిదా తర్వాత వరుణ్ తేజ్ కు ఈ సినిమాతో విజయం అనేది పక్కా అని చెప్పవచ్చు. కథ, కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా  సినిమాలో రాశికన్నా ఎక్కువగా ఫోకస్ అయ్యింది. కథనంతోనే బోర్ కొట్టకుండా దర్శకుడు సినిమాను నడిపించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా సినిమా మధురానుభూతిని యువతకు పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here