6 ఏళ్ళ వయసు వున్నా బుడ్డోడు నెలకి 6 కోట్లు సంపాదిస్తున్నాడు ఎలానో తెలిస్తే షాక్ అవ్వలసిందే

0
172

6 ఏళ్ళ వయసు వున్నా బుడ్డోడు నెలకి 6 కోట్లు సంపాదిస్తున్నాడు అంటేనే ఆశ్చర్యం వేసింది కాదు. నాకు ముందు అలానే అనిపించింది కానీ ఇది నిజం. “రైన్” అనే 6 ఏళ్ళ వయసు వున్నా చిన్న పిల్లవాడు సంవత్సరానికి 11 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 70 కోట్లు అన్నమాట. అంటే నెలకి 6 కోట్లు. ఇదంతా పక్కన పెడితే అసలు రైన్ 6 కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు అనే కదా మీప్రశ్న?

 

 

రైన్ ది ఒక యూట్యూబ్ చానెల్స్ రన్ చేసే కుటుంబం. చిన్నప్పటినుండి వాళ్ళ అమ్మ నాన్నలు చేసే యూట్యూబ్ వీడియోలు చూస్తూ పెరిగాడు. అయితే రైన్ కు 4 సంవత్సరాల వయసు వచ్చినప్పటినుండి రియాన్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అని అనుకున్నాడు. అయితే రైన్ మర్చి 2015 నుండి యూట్యూబ్ చానెల్ లో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసాడు. తాను ఉపయోగించే బొమ్మలపై రివ్యూలు చెప్పడం మొదలు పెట్టాడు. జులై 2015 వరకు కూడా యూట్యూబ్ ఛానల్ స్లో గానే ఉంది.

 

 

అయితే దానితరువాత రైన్ “GIANT EGG Surprise” అనే 100 బొమ్మలను కలిగి ఉన్న బాక్స్ ను రివ్యూ చేసాడు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇది ప్రస్తుతం 800 మిలియన్ల వ్యూస్ దగ్గరగా ఉంది.

దాని తరువాత రైన్ చేసిన ఏ వీడియో అయినా అదే స్థాయిలో స్పందన వచ్చింది. ఆలా రైన్ చేస్తున్న వీడియోస్ వలన ఎప్పుడు అతని యూట్యూబ్ ఛానల్ 10 మిలియన్ subscribers” రీచ్ అయ్యాడు. ఎప్పుడు అతని యూట్యూబ్ ఇన్కమ్ నెలకి దగ్గరదగ్గర 1 మిలియన్ డాలర్స్. దానితరువాత “రైన్” కిడ్స్ కి సంబందించిన ఫుడ్ మరియు హెల్త్ ప్రొడక్ట్స్ పైన కూడా రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టాడు.

ఇదే విషయాన్నీ “ఫోర్బ్స్ మ్యాగజిన్” ప్రకటించింది. యూట్యూబ్ నుండి ఎక్కువ సంపాదిస్తున్న వారిలో రైన్ పేరును కూడా ఫోర్బ్స్ ప్రకటించడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే దీనివెనుక అతని తల్లిదండ్లులు సహకారం ఎంతో వుంది. దానివల్లనే రియాన్ ఈ రోజు ఆ స్థాయిలో వున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here