ఈ శాడిస్టు భర్తకు ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది

0
127

శాడిస్టు భర్తపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తొలి రాత్రే నవ వధువుపై దాడి చేసి కాళరాత్రి మిగిల్చిన శాడిస్టుపై కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ప్రస్తుతం కోలుకుంటోంది. మధ్య తరగతికి చెందిన యువతి ఆమె. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకుంది.

అయితే ఆమె స్వప్నం చెరిగిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. తాను కన్న కలలు పండాల్సిన మొదటి రాత్రే ఆమెకు కాళరాత్రిగా మారింది. జీవితంలో వెలుగు నింపుతాడని అనుకున్న మొగుడే కాలయముడిగా మారాడు. మొదటి రాత్రే వికృత రూపం చూపాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది చిత్రవధ చేశాడు. ఆమె అందమైన స్వప్నాన్ని కాస్త భయంకర పీడకలగా మార్చాడు.

ఈ శాడిస్టు భర్తకు ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కలెక్టర్ ఆదేశాలమేరకు టీచర్ రాజేష్ ను విదులనించి సస్పెండ్ చూపినట్లు డిఇవో పాండురంగస్వామి చెప్పారు. ఆదివారం అయన మీడియా తో మాట్లాడి ఈ విషయాన్ని వెల్లడించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here