మన దేశం లో ధనవంతులైన ఆటగాళ్లు టాప్11లో ఎవరు ఉన్నారో చూడండి.

0
127

మన దేశం లో టాప్ 11 ధనవంతులైన ఆటగాళ్లు

మ‌న దేశంలో ఆట‌ల‌కు ఆద‌ర‌ణ ఎక్కువే. ఆట‌గాళ్ల‌ను దేవుళ్ల‌తో స‌మానంగా కొలిచే దేశం మ‌న‌ది. ముఖ్యంగా క్రికెట్లో ఈ సంస్కృతి ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఇప్పుడిప్పుడే హాకీ, టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్‌, స్నూక‌ర్‌, చెస్ లాంటి ఆట‌ల‌కు ఆద‌ర‌ణ పెరిగిపోతుంది. ఇందుకే ఆట‌గాళ్ల‌ను సెల‌బ్రిటీలుగా చూస్తారు. వివిధ ఎండోర్స్‌మెంట్లు, కాంట్రాక్టుల్లో భాగంగా యాడ్స్ చేస్తున్నందుకు వాళ్లు రోజురోజుకు సంప‌న్నుల‌వుతున్నారు. మ‌రి మన దేశం లో ధనవంతులైన ఆటగాళ్లు టాప్11లో ఎవరు ఉన్నారో తెలుసుకుందామా…

 

11. సైనా నెహ్వాల్‌

 

బ్యాడ్మింట‌న్ ఏస్ ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్‌. ఈ క‌థ‌నంలో క్రికెట్ ఆట‌గాళ్ల పేరు కూడా బ్యాడ్మింట‌న్‌కూ త‌గిన స్థానం ద‌క్కింది. ఇందులో మ‌న హైద‌రాబాదీ సైనా నెహ్వాల్ చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. బ్యాడ్మింట‌న్‌లో ఆమె ఎన్నో జాతీయ‌, అంత‌ర్జాతీయ టైటిళ్ల‌ను సొంతం చేసుకుంది. ఒక‌ప్పుడు టాప్ వ‌రల్డ్ ర్యాంకింగ్‌లో 2వ ర్యాంకులో కొన‌సాగింది.ఆమె నిక‌ర విలువ 15 మిలియ‌న్ డాల‌ర్లు.

 

10. గౌత‌మ్ గంభీర్‌

 

 

టాలెంటెడ్ బ్యాట్స్‌మ్యాన్ గా గౌత‌మ్ గంభీర్‌కు పేరుంది. ఢిల్లీకి చెందిన ఈ ఆట‌గాడు క్రికెట్‌ అగ్రెసివ్‌గా ఆడతాడు. దేశంలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన వారిలో ఇత‌డొక‌డు. ఇత‌డి నిక‌ర విలువ 20 మిలియ‌న్ డాల‌ర్లు.

 

9. రాహుల్ ద్ర‌విడ్‌

 

రాహుల్ ద్రావిడ్ మాజీ క్రికెట‌ర్‌. ఆట‌లో స‌హ‌నం కోల్పోడు. సంప‌న్న ఆట‌గాళ్ల‌లో ఇత‌ని స్థానం 9లో ఉంది. టీమ్‌లో బ్యాట్స్‌మ‌న్‌గా మంచి పేరుతో పాటు అద్భుత‌మైన కెరీర్ చ‌రిత్ర ఇత‌డి సొంతం. ఇత‌డి నిక‌ర విలువ 22.6 మిలియ‌న్ డాల‌ర్లు.

 

8. సానియా మీర్జా

 

ప్ర‌ముఖ టెన్నిస్ తార‌ల్లో సానియా మీర్జా ఒక‌రు. ఆమె నిక‌ర విలువ 26 మిలియ‌న్ డాల‌ర్లు. ఆమె పాకిస్థానీ క్రికెట‌ర్ అయిన షోయ‌బ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. ఆడిడాస్‌, విల్స‌న్‌, ఎఫ్ఏబీబీ లాంటి యాడ్స్‌ను ఎండోర్స్ చేస్తుంది.

 

7. యూసుఫ్ ప‌ఠాన్‌

 

క్రికెట్‌లో న‌ల్ల‌గుర్రంగా యూసుఫ్ ప‌ఠాన్‌కు పేరుంది. అద్భుత‌మైన ఆల్ రౌండ‌ర్ ఆట‌గాడిగా ఇత‌డికి పేరుంది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ త‌న ప్ర‌తిభ‌ను అద్భుతంగా ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డు. అత‌డి నిక‌ర విలువ 26.5 మిలియ‌న్ డాల‌ర్లు. పెప్సికో, టాటా ఇండికామ్ లాంటి బ్రాండ్ల‌ను ఎండోర్స్ చేస్తున్నాడు.

 

6. యువ‌రాజ్ సింగ్‌

 

పంజాబ్ సింహంగా యువ‌రాజ్ సింగ్‌ను పిలుస్తారు. ఇత‌డి నిక‌ర విలువ 35.5 మిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. క్యాన్స‌ర్‌తో పోరాడి తిరిగి విజ‌య‌వంత‌మైన ఆట‌గాడిగా క్రికెట్‌లో నిల‌దొక్కుకున్నాడు. ఆక‌ర్ష‌ణీయ‌మైన రూపురేఖ‌ల వ‌ల్ల అత‌డు న‌టించే ప్ర‌తి వాణిజ్య ప్ర‌క‌ట‌న బాగా క్లిక్ అయ్యింది. పూమా, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థ‌ల ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాడు.

 

5. వీరేంద్ర సెహ్వాగ్‌

 

ఢిల్లీకి చెందిన అగ్రెసివ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌. 40 మిలియ‌న్ డాల‌ర్ల‌ భారీ నెట్‌వ‌ర్త్ ఉండ‌టం వ‌ల్ల మ‌న దేశంలో ధ‌నిక స్పోర్ట్స్‌ప‌ర్స‌న్‌లో ఒక‌డిగా స్థానం సంపాదించాడు. టెస్ట్ మ్యాచ్‌ల‌లో ట్రిపుల్ సెంచ‌రీ రికార్డు ఘ‌న‌త‌ను సాధించాడు. వ‌న్డే క్రికెట్‌లో డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు. ఫిలా, హీరో హోండా, జెకె సిమెంట్స్ లాంటి బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేశాడు.

 

4. సౌర‌వ్ గంగూలీ

 

55.5 మిలియ‌న్ డాల‌ర్ల నిక‌ర విలువ‌తో 4వ స్థానాన్ని సౌర‌వ్ గంగూలీ ఆక్ర‌మించుకున్నాడు. ఇత‌డు మాజీ క్రికెట్ క్యాప్ట‌న్‌. కోల్‌క‌తా యువ‌రాజుగా ఇత‌డికి పేరుంది. భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన్నో విజ‌యాల‌ను అందించాడు. ఇప్పుడు క్రికెట్‌కు స్వ‌స్తి ప‌లికి ప్ర‌ముఖ టీవీ షోలో క్రికెట్ వ్యాఖ్యానం చేస్తున్నాడు.

 

3. విరాట్ కోహ్లీ

 

ప్ర‌స్తుత భార‌త క్రికెట్ టీమ్ క్యాప్ట‌న్‌గా విరాట్ కోహ్లీ కొన‌సాగుతున్నాడు. సంప‌న్న ఆట‌గాళ్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. అత‌డి నిక‌ర విలువ 60 మిలియ‌న్ డాల‌ర్లు.ఇటీవ‌లె ఫోర్బ్స్ జాబితాలో అత్యంత అధిక పారితోషికం అందుకునే ఆట‌గాడిగా చోటు సంపాదించుకున్నాడు. ఆయ‌న్ అద్భుత‌మైన ఆట‌తీరు వ‌ల్ల ఐపీఎల్‌లో 2వ అత్య‌ధిక పెయిడ్ ఆట‌గాడిగా పేరు తెచ్చుకున్నాడు. హాట్ లుక్స్‌తో అద‌ర‌గొట్ట‌డం వ‌ల్ల ఎన్నో బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా అద‌ర‌గొట్టాడు. బాలీవుడ్ భామ అనుష్క శ‌ర్మ‌తో చెట్టాప‌ట్టాల్ వేసుకొని ఎన్నో సార్లు మీడియా కంటికి క‌నిపించాడు.

 

2. ఎం.ఎస్‌.ధోని

 

మ‌హేంద్ర సింగ్ ధోనికి మ‌న దేశంలో ఎంత ఆద‌ర‌ణ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌లేం. అత‌డి జీవిత క‌థ ఆధారంగా సినిమా కూడా తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించింది. 2వ అతి పెద్ద సంప‌న్న ఆట‌గాడిగా ధోనికి పేరుంది. అత‌డి నిక‌ర విలువ 110 మిలియ‌న్ డాల‌ర్లు. క్యాప్ట‌న్‌గా టీమిండియాకు ఎన్నో విజ‌యాల‌ను అందించాడు. ప్ర‌స్తుతం అత‌డు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకొన్నాడు. రీబాక్‌, పెప్సి, జీఈ మ‌నీ, టీవీఎస్ మోటార్స్ లాంటి అనేక బ్రాండ్ల‌కు ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించాడు. ఆక‌ర్ష‌ణీయ‌మైన తేజ‌స్సు అత‌డికున్న అద‌న‌పు హంగు.

 

1. స‌చిన్ టెండుల్క‌ర్‌

 

క్రికెట్ దేవుడిగా స‌చిన్ టెండుల్క‌ర్‌ను కొలుస్తారు. సంప‌న్న ఆట‌గాళ్ల జాబితాలో తొలిస్థానంలో ఉన్నాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో గొప్ప ఆట‌గాడిగా స‌చిన్‌కు పేరుంది. స‌చిన్ పేరుతో వ‌చ్చిన బ‌యోపిక్ సినిమాలో స్వ‌యంగా అత‌డే నటించ‌డం విశేషం. అనంత‌పురం జిల్లాలోని పుట్ట‌వారికండ్రిగ అనే గ్రామాన్ని అత‌డు ద‌త్త‌త తీసుకొని ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచాడు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నాడు. స‌చిన్ నిక‌ర విలువ 160 మిలియ‌న్ డాల‌ర్లు. అత‌డు లెక్క‌లేన‌న్ని అవార్డుల‌ను త‌న కెరీర్‌లో సొంతం చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here