శుభవార్త: జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొడిగింపు, డిసెంబర్ 15 వరకు బంపర్ ఆఫర్

0
130

శుభవార్త: జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొడిగింపు, డిసెంబర్ 15 వరకు బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. 2017 , డిసెంబర్ 15వ, తేది వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో ప్రకటించింది.

షాక్: జియోతో రూ.50 బిలియన్ డాలర్ల నష్టం: సునీల్ మిట్టల్

రిలయన్స్ జియో ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపుతోంది. రిలయన్స్ జియో కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ధరలను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

జియోకు షాక్: రూ.2లకే సూపర్‌ఫాస్ట్ డేటా, పెండింగ్‌లో ధరఖాస్తులు

రిలయన్స్ జియో మార్కెట్లోకి కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. ఇతర టెలికం కంపెనీల కష్టమర్లు కూడ తమ వైపుకు మళ్ళేలా రిలయన్స్ జియో ఆఫర్లను ఇస్తోంది. దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లను ఇవ్వాల్సిన పరిస్థితులు తెచ్చిపెడుతోంది.

జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్

జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

డిసెంబర్ 15 వరకు ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్

డిసెంబర్ 15 వరకు ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్

ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చిన రిలయన్స్ జియో తొలుత నవంబర్ 25వ, తేది వరకేనని ప్రకటించింది.అయితే ఈ ఆఫర్‌ను డిసెంబర్ 15వ, తేది వరకు పొడిగిస్గున్నట్టు ప్రకటించింది. ప్రైమ్‌ యూజర్లు జియో ఓచర్లు, వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌, ఆన్‌లైన్‌ ట్రావెల్‌, షాపింగ్‌ డిస్కౌంట్లను వచ్చే నెల మధ్య వరకు ఆఫర్‌ చేయనుంది. రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది..

రీ చార్జీ వోచర్లు

రీ చార్జీ వోచర్లు

రిలయన్స్ జియో ప్రైమ్ కష్టమర్లు రూ.399 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంలో రీ ఛార్జీ చేసుకొంటే రూ.400 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ ఇవ్వనుంది. అయితే రూ.50 విలువైన రీ ఛార్జీ వోచర్లు 8 అందించనుంది.తర్వాత రీఛార్జ్‌ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. జియో ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద మైజియో, జియో.కామ్‌ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్‌ చేస్తోంది.

 డిజిటల్ వ్యాలెట్ రీ ఛార్జీ చేస్తే క్యాష్ బ్యాక్

డిజిటల్ వ్యాలెట్ రీ ఛార్జీ చేస్తే క్యాష్ బ్యాక్

డిజిటల్‌ వాలెట్ల నుంచి రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్‌లు అందుతున్నాయి.కొత్త యూజర్‌గా జియో నెట్‌వర్క్‌లో చేరి, అమెజాన్‌ పేను వాడుతూ రూ.459 రీఛార్జ్‌ ప్యాక్‌ను కొనుగోలు చేస్తే, రూ.400 విలువైన ఓచర్లు, పే బ్యాలెన్స్‌గా రూ.50 క్యాష్‌బ్యాక్‌, మొత్తంగా రూ.450 కస్టమర్లకు కంపెనీ ఆఫర్‌చేస్తుంది.వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌, జియో ఓచర్లను వెంటనే రిడీమ్‌ చేసుకోవచ్చు.

 ప్యాషన్, ట్రావెల్ టిక్కెట్లపై బారీ డిస్కౌంట్

ప్యాషన్, ట్రావెల్ టిక్కెట్లపై బారీ డిస్కౌంట్

ఒరిజినల్‌ ఆఫర్‌ మాదిరిగా కాకుండా.. యాక్సిస్‌ బ్యాంకు, ఫ్రీఛార్జ్‌ యూజర్లకు ఈ క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. క్యాష్‌బ్యాక్‌లతో పాటు ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌, ట్రావెల్‌ కొనుగోళ్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో ఆఫర్‌ చేస్తోంది. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Read more about: reliance jio, cash back offer, extended to december 15,

రిలయన్స్ జియో, క్యాష్ బ్యాక్ ఆఫర్, డిసెంబర్ 15 వరకు పొడిగింపు

English summary : The Jio cashback offer providing customers with benefits worth up to Rs. 2,599, announced earlier this month, was supposed to end on November 25. However, the telecom operator has quietly extended the last date of the offer, moving it to December 15. This means Prime users will be able to get the Jio vouchers, wallet cashback, and online travel and shopping discounts till the middle of next month. However, the list of Jio partners offering wallet cashbacks has become smaller this time around.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here