లోకల్ ఫిలిమ్స్: అమ్మాయి అందంగా ఉండాలి.. అరుపులు బాగా వినపడాలి, ఇదో కొత్త వ్యసనం!

0
250

ఓ యువకుడు ఓ యువతిపై అత్యాచారం చేయడమే దారుణం అనుకుంటాం. కానీ అంతకంటే దారుణమైన విషయమిది. అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు అంగళ్లలో యధేచ్చగా విక్రయిస్తున్నారు.

ఒకప్పుడు పైరేటెడ్ సినిమాల విక్రయించిన కొంతమంది వ్యాపారులు ఇప్పుడు ఈ అత్యాచార వీడియోలను జోరుగా అమ్ముతున్నారు. వీటిని ‘లోకల్ ఫిలిమ్స్’ అని పిలుస్తున్నారు. అదేమంటే.. ఇప్పుడు వీటికే డిమాండ్.. యువకులు, విద్యార్థులు అడుగుతున్నారు అంటున్నారు.

 

అత్యాచార వీడియోల విక్రయం…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయించే నాకా హిందోళ మార్కెట్ లో ఇప్పుడో కొత్త దందా నడుస్తోంది. ఈ మార్కెట్ లో రేప్ వీడియోల విక్రయం జోరుగా సాగుతోంది. అత్యాచార వీడియోలకు డిమాండు పెరగడంతో కొందరు వ్యాపారులు వీటిని గుట్టుగా లోకల్ ఫిలిమ్స్ పేరిట పెన్ డ్రైవ్‌లలో వేసి విక్రయిస్తున్నారు.

 

 

తెల్లవారక ముందే దందా షురూ…

తెల్లవారక ముందే నాకా హిందోళ మార్కెట్ లో ఈ రకమైన వ్యాపారం మొదలవుతోంది. కొన్ని షట్టర్లు సగమే తెరిచి ఉంటాయి. ఆయా దుకాణాల వద్దకు వచ్చిన యువకులు వాళ్లకేం కావాలో గుసగుసగా చెప్పి ఓ పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళతారు. తిరిగి వాళ్లు వచ్చేసరికి ఆ పెన్ డ్రైవ్ లలో వారు కోరుకున్న సంఖ్యలో అత్యాచార వీడియోలు సిద్ధంగా ఉంటాయి.

 

బ్లర్ చేసి.. ఆడియో ట్రాక్ జత చేసి...

10 నుంచి 30 నిమిషాల నిడివి గల రేప్ వీడియోను రూ.300 నుంచి రూ.500 వరకూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. వ్యాపారులు ఇలాంటి అత్యాచార వీడియోలను రూ.5 వేలకు కొంటున్నారు. రేపిస్టు ముఖం కనిపించకుండా బ్లర్ చేసి దానికి బాధిత అమ్మాయి పెట్టే కేకలతో కూడిన ఆడియో ట్రాక్ జోడించి రూ.100 నుంచి రూ.200కు కూడా వీటిని విక్రయిస్తున్నారు.

 

పక్కనే పోలీస్‌స్టేషన్ ఉన్నా..

గతంలో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఉపయోగపడిన ఈ రేప్ వీడియోలు ప్రస్థుతం కొంతమంది వ్యాపారులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. విచిత్రమేమిటంటే రేప్ వీడియోలు విక్రయిస్తున్న ఈ నాకా హిందోళ మార్కెట్ కు కేవలం 500 మీటర్ల దూరంలోనే పోలీసుస్టేషన్ ఉండడం.

 

ముడుపులందుకుని మౌనం…

నాకా హిందోళ మార్కెట్ వ్యాపారుల నుంచి నెలనెలా మామూళ్లు పుచ్చుకుంటున్న పోలీసులు ఈ విషయంలో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఈ మాటను అక్కడి వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. గతంలో పైరేటెడ్ ఫిలిం వీడియోలు విక్రయించే వ్యాపారులు ప్రస్తుతం డిమాండును బట్టి రేప్ వీడియోలను విక్రయిస్తున్నారు.

యువకులు, విద్యార్థుల నుంచి భారీ డిమాండ్…

ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన యువకులు మార్కెట్ కు వచ్చి ఇలాంటి రేప్ వీడియోలను కొంటున్నారు. ‘అమ్మాయి అందంగా ఉండాలి.. అరుపులు బాగా వినబడాలి.. ఓ ఐదు లోకల్ ఫిలిమ్స్ ఈ పెన్‌డ్రైవ్‌లో వేసి ఉంచు.. సాయంత్రం వస్తా..’ అంటూ యువకులు తమకు ఎలాంటి అత్యాచార వీడియోలు కావాలో కూడా దుకాణదారులకు సూచిస్తున్నారంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

English summary :  It is 10.30 am and most of the shops in Naka Hindola market — known as the grey market for electronic goods in Lucknow — are yet to open. Inside a dusty lane, a man peeps inside a partially lifted shutter and says, “Paanch local film chahiye — achche wale. Sham ko aaunga” (I need five local films—will come in the evening), and walks off. The “local films” he is referring to are real-life rape videos that are now the fastest selling commodities in this market. These rape videos are sold clandestinely only to known customers in blank covers. To make the business more discreet, most of these videos are sold in USB pen drives.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here