‘రంగస్థలం’ మూవీ చూసి ఇచ్చిన జెన్యూన్ రివ్యూ.. హిట్టా.? ఫట్టా.?

1
580

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటలకు బెనిఫిట్ షోలు పడగా.. అమెరికాలో కొన్ని గంటల ముందే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా మంచి రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా హిట్టా ఫట్టా తెలుసుకుందాం..

* కథ ఏంటంటే..

1985 కాలంలోని గోదావరి తీరంలో ఉన్న రంగస్థలం అనే ఊరి రాజకీయాల నేపథ్యంలో సాగే కథ. ఇందులో ఇద్దరు ప్రేమికులు, సర్పంచ్ రాజకీయాలు ప్రధాన ఇతివృత్తంగా దర్శకుడు సుకుమార్ కథను రూపొందించారు. ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో సాగే ఎన్నికల పోరును అత్యంత రసవత్తరంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు తన అద్భుతమైన నటనతో రాంచరణ్ ప్రాణం పోశారు. అంతేకాదు.. విలన్ గా జగపతి బాబు, రాంచరణ్ కు అన్నగా ఆది, ప్రకాష్ రాజ్ సహజ శైలి.. రంగమ్మత్తగా అనసూయ, హీరోయిన్ గా సమంత నటన నభూతో నభవిష్యతిలా ఉంది. ముఖ్యంగా గ్రామ రాజకీయాల నేపథ్యంలో రాంచరణ్ అన్న ఆది మరణించడం.. ప్రీక్లైమాక్స్ నుంచి సినిమా చివరి వరకు ఒకే ఎమోషన్ ను క్యారీ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైప్ ని తీసుకొచ్చింది. బలమైన కథలో కీలక మలుపు తిప్పే ఆ సన్నివేశం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించేలా ఉందంటున్నారు. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే నెమ్మదించినా ఫైనల్ గా మెగా అభిమానులకు ఇదో పవర్ ప్యాక్ మూవీ అంటూ రంగస్థలం థియేటర్స్ నుంచి వినిపిస్తున్న మాట..

* సినిమా ఎలా ఉందంటే..

రంగస్థలం అద్భుతమైన గ్రామీణ నేపథ్య బ్యాక్ డ్రాప్ మూవీగా తెరపై అద్భుతంగా కనిపించింది. రాంచరణ్ లో అద్భుతనటుడు ఉన్నాడని.. రాంచరణ్ ను సుకుమార్ వాడుకున్నట్టు ఎవ్వరూ వాడుకోలేదని సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమాకు సెకండాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ కీలకం.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్. సినిమాలోని ట్విస్టులు థ్రిల్ చేస్తాయి. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంది. మొత్తంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎమోషన్ ఫీలవుతారు. మానవ సంబంధాలు అద్భుతంగా తెరపై చూపించారు. అన్నదమ్ముల అనుబంధం, తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారితో గ్రామాల్లో ఉండే అప్యాయతలు తెరపై అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. మొత్తం గా ఈ సమ్మర్ లో వచ్చిన ‘రంగస్థలం’ గ్రాండ్ హిట్ అంటున్నారు ప్రేక్షకులు.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here