కూతుర్లు చేసిన పనికి సిగ్గుతో కన్నీళ్లు పెట్టిన రాధ.. ఏం జరిగింది

0
465

దక్షణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు డాన్స్ క్వీన్ అంటే రాధ తప్పితే మరి ఎవ్వరు గుర్తురారు.80 వ దశకంలో తన అందచందాలు డాన్సులతో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది రాధ. తెలుగు హీరోలలో ఎవర్గ్రీన్ డాంసింగ్ హీరోగా చిరంజీవిని చెప్పుకుంటారు. అలంటి మెగాస్టార్ స్పీడ్ ని అందుకోవడం రాధా ఒక్కదానికే సాధ్యం అయ్యింది. తెలుగులో చిరంజీవి తో ఎక్కువ సినిమాలు చేసింది రాధ. అప్పట్లో వాళ్ళను హిట్ పెయిర్ గా చెప్పుకునేవారు. ఒక చిరు తోనే కాదు… బాలకృష్ణ , నాగార్జున వెంకటేష్ తోను రాధ అనేక సినిమాలు చేసి నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది.

తన కెరియర్ లో దాదాపు 250 సినిమాలు చేసిన రాధ 1991 తరువాత వెండితెరకు దూరమైంది. తన బంధువైన రాజశేఖర్ నాయర్ ని పెళ్ళాడి ముంబైలో స్థిరపడింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు , ఒక కొడుకు వున్నారు. కూతుర్లు కార్తీక, తులసి తల్లి బాటలోనే సినీపరిశ్రమలోకి అడుగు పెట్టారు.

 

అయితే సినిమా ఇండస్ట్రీ చాల విచిత్రమైనది రాధను ఎంత ప్రోత్సహించిందో ఆమె కుమార్తెలను అంత నిరాశకు గురిచేసింది. తన కెరియర్లో రాధ మొదటినుండి చివరివరకు స్టార్ హీరోయిన్ గానే కొనసాగింది. కానీ కార్తీక తులసి మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తమిళ్ నుండి తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా రంగం తో కార్తీకకు తెలుగులోని గుర్తింపు దక్కింది. అయితే నాగచైతన్య మొదటి సినిమా జోష్ సిమిమతో తెలుగు లోకి అరంగేట్రమ్ చేసింది. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాలో ఒక రోల్ చేసింది. ఆ తరువాత అల్లరి నరేష్ తో హీరో చెల్లెలిగా కామెడీ పంచిందికాని అది ప్రేక్షకులకు సరైన విధంగా రీచ్ కాలేదు. ఆ సినిమా ప్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. దానితో టీవీ సీరియళ్లకు మొగ్గుచూపింది.

ఇక రాధ చిన్న కూతురు తులసిది కూడా సేమ్ స్టోరీ. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కడలి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తులసి. ఆ తరువాత జీవ హీరోగా ఎన్ అనే సినిమాలో చేసింది. ఆ రెండు సినిమాలు త్తుసుమనడం తో తులసి కెరియర్ కె బ్రేకులు పడ్డాయి.

అయితే తాను ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన రోజులు గుర్తుచేసుకున్న రాధ. ఎప్పుడు తన కుమార్తెల కారణంగా అప్రతిష్ట కావడం తట్టుకోలేకపోతోందట. అప్పట్లో రాధ నిర్మాతలకు ఎం చెప్తే అది చేసేవారని. హీరోయిన్ గా గొప్పగా వెలిగి పోయానని కానీ మీరు మాత్రం నా పరువు తీశారు అంటూ కుమార్తెలపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. స్టార్ హీరోలతో ఛాన్స్ లు అందుకోలేక కనీసం ఒక సినిమాకూడా చేతిలో లేక ఇంటికి వచ్చారా అని తీవ్రంగా విమర్శించిందట. డాన్స్ యాక్టింగ్ ఏదికావాలంటే అదినేర్పించాను అని కానీ ఎంతలా నిరాశ పరుస్తారని అనుకోలేదు అని తన సన్నిహితులవద్ద వాపోయిందట రాధ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here