షాకింగ్ న్యూస్.. పెట్రోల్ ధర రూ.300 కాబోతోంది.. 

0
136

షాకింగ్ న్యూస్.. పెట్రోల్ ధర రూ.300 కాబోతోంది..

ఇప్పటికే మోడీ సర్కారు దయ వల్ల పెట్రోల్ ధరలకు పట్టాపగ్గాలు లేకుండా వదిలేయడంతో తెల్లవారితే ఎప్పుడు ఎంత పెట్రోల్ రేటు ఉంటుందో.. ఎంత పెరుగుతుందో తెలియక జనాలు పిచ్చవాళ్లవుతున్నారు. ఇప్పుడు మరో వార్త వాహనదారులను కలవరానికి గురిచేస్తోంది. అదే పెట్రోల్ లీటర్ కు రూ.300 కాబోతోందనే వార్త అందరిలోనూ ఆందోళనను రేకెత్తిస్తోంది.

అప్పట్లో అంటే 1990-91 వ సమయంలో గల్ఫ్ యుద్ధం జరిగింది గుర్తుందా.. అప్పుడు యుద్ధం వల్ల అరబ్ దేశాల్లో చమురు నిక్షేపాల బావులన్నీ నాశనమై ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఏర్పడి విపరీతంగా ధరలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతోంది..

అరబ్ దేశాల్లోనే సంపన్న దేశమైన సౌదీ అరేబియాకు, మరో దేశమైన ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పొడచూపుతున్నాయి. సౌదీ అరేబియా పక్కనున్న యెమెన్ , సిరియాల్లో తీవ్రవాదులకు సాయం చేస్తూ ఇరాన్ పలు దేశాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ చేష్టలు సౌదీ అరేబియా భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, ఇరాన్ తో పాటు వైరీ దేశాలతో యుద్ధానికి దిగబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ యుద్ధమే జరిగితే పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలున్న సౌదీతో పాటు ఇరాన్ నుంచి మన దేశానికి చమురు సరఫరా ఆగిపోతుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 300 నుంచి రూ.500 పెరిగవచ్చని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఆ అరబ్ దేశాల మధ్య యుద్ధం జరగకూడదని ప్రపంచమంతా కోరుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here