ఏడు గంటల కు మించి పడుకుంటే ఏమవుతుందో తెలుసా..

0
153

ఏడు గంటల కు మించి పడుకుంటే ఏమవుతుందో తెలుసా..

బాగా నిద్రపోయే అలవాటు మీకుందా? దాంతోపాటు పుస్తకాలు చదివే హాబీ కూడా ఉందా? ఈ రెండు అలవాట్లూ మీకుంటే చాలా మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోజూ ఏడు గంటల పాటు నిద్రపోవడం, బాగా పుస్తకాలు చదవడం వల్ల మీ మెదడు చురుగ్గా పనిచేయడమే కాదు మానసికంగా కూడా మీరు ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు. స్పెయిన్‌లోని కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా 245 మంది సీనియర్‌ సిటిజన్లను పరీక్షించారు. అందరూ 65 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లే. వీరిపై చేసిన అధ్యయనంలో, ఎక్కువ గంటలు నిద్రపోయే వారిలో లేదా బాగా తక్కువ గంటలు పడుకునే వారిలో, పుస్తకపఠనం అలవాటులేనివారిలో మెదడు సరిగా అభివృద్ధి చెందడం లేదని తేలింది.

రోజుకు ఎనిమిది గంటలు పైగా నిద్రపోయేవాళ్లలో లేదా 2 నుంచి 6 గంటలు మాత్రమే పడుకునే వాళ్లలో 2.6 రెట్లు మేర కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌ సంభవించే అవకాశం ఉంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు లేకపోవడం వల్ల కూడా బ్రెయిన్‌కి సంబంధించి కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌ వచ్చే ప్రమాదం ఉంది. పుస్తకాలు అస్సలు చదవని వారిలో ఈ రిస్కు 3.7 రెట్లు ఉందని అధ్యయనంలో తేలింది. అప్పుడప్పుడు పుస్తకాలు చదివే వారిలో ఈ రిస్కు 2.5 రెట్లు ఉంది. ఈ అధ్యయనం కింద పరీక్షించిన వారిలో 12 శాతం మంది కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యవంతమైన జీవనశైలి వల్ల కూడా మెదడు చురుగ్గా ఆలోచిస్తుంది. అభివృద్ధి చెందుతుంది. నిత్యం వ్యాయామాలు చేయడం, హెల్తీ డైట్‌ తీసుకోవడం, ముఖ్యంగా బ్రెయిన్‌ని ఉత్తేజపరిచే ఒమేగా-3 ఫుడ్స్‌, యాంటాక్సిడెంట్ల వల్ల కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here