ఏ మోసం లేకుండా “హైదరాబాద్ మెట్రో”లో ఫ్రీ గా ట్రెవెల్ చేయొచ్చు తెలుసా.? ట్రిక్ ఏంటంటే..?

0
132

రైల్వేస్టేషన్ కి వెళితే ప్లాట్ ఫాం టికెట్ ధర పదిరూపాయలు..అదే ఎంఎంటిఎస్ టికెట్ ధర ఐదు రూపాయలు చాలా మంది ప్లాట్ ఫాం టికెట్ బదులు ఎంఎంటిఎస్ టికెట్ కొని స్టేషన్లో గడిపి వచ్చేస్తారు..దాని ఫలితంగా వారికి మిగిలింది 5రూపాయలు..సేమ్ అలాంటి ట్రిక్ నే  మెట్రోలో అప్పుడే ఆకతాయిలు తమ పనులు మొదలెట్టేశారు…వందల్లో ఉన్న మెట్రోటికెట్ ను తీసుకోకుండా  పది రూపాయల ఫైన్ కట్టి తప్పించుకుంటున్నారు..అదెలాగో చూడండి…

ఇద్దరు స్నేహితులు బుధవారం మెట్రోలో అమీర్‌పేట నుంచి మియాపూర్‌కు బయలు దేరారు. స్మార్ట్‌ కార్డు కొనుగోలు చేసి ఎలక్ట్రానిక్‌ గేటు వద్ద స్వైప్‌ చేసి మెట్రో ఎక్కారు. మియాపూర్‌కు వెళ్లారు. అక్కడ ప్లాట్‌ఫాం మీద కాసేపు గడిపి తిరిగి మెట్రోలో అమీర్‌పేట చేరుకున్నారు. మెషిన్‌ వద్దకు వచ్చి స్మార్ట్‌ కార్డు స్వైప్‌ చేయగానే పది రూపాయల జరిమానా పడినట్టు చూపించింది. ఎందుకు అలా వచ్చిందని స్నేహితులు ఆరా తీయగా ప్లాట్‌ఫాంలో అరగంట అంతకు మించి ఉంటే ఛలానా పడుతోందని చెప్పారు. ఇక్కడ స్నేహితులు మియాపూర్‌ వరకు వెళ్లి వచ్చినందుకు అయ్యే చార్జి మాత్రం పడలేదు.అబ్బా ఇలా చేస్తే భలేవుందంటూ ఇద్దరు ఎస్కలేటర్‌ మీదుగా కిందకు చేరుకున్నారు.

మెట్రోలో ప్రయాణించే వారు గమ్యస్థానానికి చేరుకున్నాక ఎగ్జిట్‌ వద్ద కార్డు స్వైప్‌ చేయగానే స్మార్ట్‌ కార్డులో అప్పటి వరకు అయిన చార్జి బ్యాలెన్స్‌లో కట్‌ అవుతోంది. ఎగ్జిట్‌ వద్ద స్వైప్‌ చేయకుండా తిరిగి బయలు దేరిన స్టేషన్‌కు వెళ్తే స్మార్ట్‌ కార్డులో చార్జి చూపించడం లేదు. దీంతో ఇదేదో బాగుంది కదా అనుకుంటూ నగర వాసులు స్మార్ట్‌ కార్డులు కొనుగోలు చేసి జాలీగా షికారు చేశారు. ఇలా..వీరు ప్రయాణించే సమయాన్ని స్టేషన్‌లోనే గడిపినట్టు చూపిస్తుండడంతో వంద రూపాయల చార్జి స్థానంలో కేవలం పది రూపాయల జరిమానా మాత్రమే పడుతోంది.

అయితే ఇలా జర్నీ చేయడం నైతికత కాదని భావించిన పలువురు వెంటనే మెట్రో అధికారులకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇంకొందరేమో దుర్వినియోగం చేశారు.తమ టెక్నికల్ పాట్రన్ లో మెట్రో అధికారులు సరిచేసుకోవాల్సిన అవసరాన్ని ఈ లోపం తెలియచెప్పింది.

ఏ మోసం చేయకుండా మెట్రోలో ఉచితంగా ప్రయాణించే అవకాశం…

మెట్రోలో మీరు ఉచితంగా ప్రయాణించే అవ‌కాశాన్ని తాళింపు రెస్టారెంటు క‌ల్పిస్తోంది. ఇందుకోసం ఏం చేయాలంటే మియాపూర్ లేదా నాగోల్ ఎటు వైపు నుంచి అయినా ప‌ర్లేదు మెట్రోలో ప్రయాణించాలి. ఆ తర్వాత మెట్రో స్టేష‌న్ల ప‌క్కనే  ఉండే ఈ రెస్టారెంట్లో ఏం తిన్నా మీ బిల్లు లోంచి మీ మెట్రో టికెట్ ఎంత‌యితే అంత డ‌బ్బును త‌గ్గించి తీసుకుంటారు. అయితే మెట్రో జర్నీ పూర్తయిన తర్వాత తాలింపున‌కు వ‌స్తేనే ఈ ఆఫ‌రు వ‌ర్తిస్తుంది.అంతేకాదు డిసెంబ‌రు 10 వ‌ర‌కు మాత్రమే ఈ ఆఫ‌ర్ చెల్లుబాటు అవుతుంది.

స‌రదాగా ఓ సారి మెట్రో ప్ర‌యాణం చేద్దాం అనుకునే వారు ఎక్క‌డికో ఎందుకు వెళ్ల‌డం… అలా మెట్రో ఎక్కి అమీర్‌పేట్ లేదా నిజాంపేట‌లో దిగి తాలింపులో చ‌క్క‌టి విందును ఆస్వాదించండి. తాలింపు రెస్టారెంట్స్ ఉన్నది అమీర్ పేటలో ఇమేజ్ హాస్పటల్ రోడ్లో,నిజాంపేట్ క్రాస్ రోడ్స్ లో..మరింకెం ఎంచక్కా మెట్రోప్రయాణం,కడుపు నిండా భోజనం ..ఎంజాయ్ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here