ఫోన్‌ పోయిందా..? అయితే ఇలా చేస్తే ఈజీగా దొరికిపోతుంది.. 

0
90

దేశంలో చాలామంది యువత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించుకొని పని చేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఎవరికైనా చేరవేయాలన్నా ఫోన్‌లదే కీలక పాత్ర. మనం రోజూ తిరిగే ప్రాంతాల పేర్లను మొబైల్‌లో పొందుపరిస్తే ఆయా రూట్‌లలో ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ కూడా ఎప్పటికప్పుడు చెప్తుంది. మనం ఏయే ప్రాంతాలకు వెళ్లాం, ఎంతసేపు ఫోన్‌ ఉపయోగించాము.. ఎప్పుడు నిద్ర లేచాం.. ఇలా ప్రతి ఒక్కటి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. నేను ఉదయం, సాయంత్ర ఆఫీస్‌కు వెళ్లే సమయంలో నెట్‌ ఆన్‌ చేయగానే ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ వస్తుంటాయి. అప్పుడు నేను ఎలా వెళ్తే ట్రాఫిక్‌ను అవైడ్‌ చేయవచ్చో ముందుగానే తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ ఒక రకంగా యువతకు అన్ని రకాల ఉపయోగపడుతోంది. మంచి కోసం ఉపయోగిస్తేనే ప్రయోజనాలు ఉన్నాయి. చెడు కోసం ఉపయోగిస్తే క్షణాల్లో తెలిసిపోతుంది. ఫోన్‌ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి.

ఎక్కడో ఫోన్‌ పెట్టి మరిచిపోతాం.. పని చేసుకుంటూ ఎక్కడ పెట్టామో తెలియక వెతుకుతుంటాం. పిల్లలు పోన్‌ తీసుకుని గేమ్‌ ఆడుకుని అయిపోయాక ఎక్కడో పెట్టి మరిచిపోతారు. ఫోన్‌ ఎక్కడుందని అడిగితే సమాధానం రాదు. దానికోసం వెతుకుతూ కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగుతాం. ఆలోచిస్తే వెతికి పట్టుకోవచ్చు. ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ ఉన్న ప్రాంతాన్ని తెలుసుకోవచ్చు. ఈమెయిల్‌ ఐడీతో కనిపించని మొబైల్‌ ఫోన్‌ను గుర్తించొచ్చు. ఎవరైనా దొంగలిస్తే లొకేషన్‌ కూడా పట్టేస్తుంది.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు జీమెయిల్‌ ఐడీ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి. కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో జీమెయిల్‌ ఐడీని ఓపెన్‌ చేయాలి. మెయిల్‌ ఐడీ పేజీలో కుడివైపు మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. వెంటనే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ఫైండ్‌ యువర్‌ ఫోన్‌ అని ఉంటుంది. అక్కడ క్లిక్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మన జీ మేయిల్‌ ఐడీ ఏ ఏ మొబైల్స్‌కి అనుసంధానం చేశామే చూపిస్తుంది. అక్కడ మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ను సెలెక్ట్‌ చేయాలి. అకౌంట్‌ వెరిఫై చేయాలని పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఐడీ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. రింగ్‌, లొకేట్‌ యువర్‌ ఫోన్‌ అని ప్రత్యక్షం అవుతుంది. కుడివైపు రెండు సింబల్స్‌ కనిపిస్తాయి. ఒకటి రింగ్‌, రెండోది మ్యాప్‌ లొకేషన్‌. ఇంట్లోనే ఉంటే రింగ్‌ అప్షన్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్న రింగ్‌టోన్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఎడమ భాగంలో మరిన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. మొబైల్‌ లొకేషన్‌, డివైజ్‌ లాక్‌, కన్సిడర్‌ ఎరైజ్‌ డాటా… అని ఉన్నాయి. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

హైదరాబాద్ వంటి మహానగరంలో ఎక్కువమంది ఉపయోగించేది ఖరీదైన ఫోన్లే. రోజుకు సుమారు వందకు పైగా వారివారి ఫోన్‌లను పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరి కొంతమంది పోనీలే అని లైట్‌గా తీసుకుంటున్నారు. యువతులు వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉంటే దొరికిన వ్యక్తి సామాజిక మద్యమాల్లో పోస్ట్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైన ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌లు ఉంటాయని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని మనోవేదన చెందుతారు. వీటికి పరిష్కారం ఉందని చాలా మందికి తెలియదనే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్మార్ట్‌ ఫోన్‌ను లాక్‌ చేయడంతో పాటు కీలక సమాచారాన్ని తొలగించే అవకాశం ఉంది.

స్మార్ట్‌ ఫోన్‌కు అనుసంధానం చేసిన జీ మెయిల్‌ ఐడీ సహాయంతో మీ ఫోన్‌ లొకేషన్‌ ఎక్కడుందో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. జీ మెయిల్‌ ఐడీ ఓపెన్‌ చేసిన తర్వాత మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ద్వారా మొబైల్‌ లోకేషన్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం పోలీస్‌స్టేషన్‌, ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here