భూమి మీద జీవం ఎలా ఏర్పడింది. మనిషి పుట్టుకకు కారణమైన పరిస్థితులేంటి

0
428

భూమి మీద జీవం ఎలా ఏర్పడింది. మనిషి పుట్టుకకు కారణమైన పరిస్థితులేంటి.? ఆసక్తికర కథనం..

ఎలాంటి ఆధారం లేకుండా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి దానికి కారణం. ఇక సూర్యుడు మండుతున్న అగ్నిగోళం. దాన్ని నుంచే భూమి, జీవం శక్తి పొందుతాయి.. ఈ సమస్త మానవాళి, ప్రకృతి, జీవం ఏర్పడడానికి సూర్యుడే కారణం. ఒకప్పుడు సూర్యుడి నుంచి విడిపోయిన అగ్ని గోళం అయిన భూమి ఆ తర్వాత చల్లబడి.. మంచుతో కప్పబడి.. చివరకు జీవం ఏర్పడింది. ఆ పరిణామ క్రమంతోనే ఇప్పుడు మనుషులుగా మనం భూమ్మీద ఉన్నాం. ఇలా జరగడానికి 600 కోట్ల సంవత్సరాలు పట్టింది .. అసలు భూమ్మీద జీవం పుట్టుకకు గల కారణాలు, ఏలా ఏర్పడ్డాయనే దానిపై ఆసక్తికర కథనం చూసేయండి..

సూక్ష్మజీవులే ఈ భూమ్మీద ఏర్పడ్డ మొదటి జీవులు. భూమి సౌరమండలపు పళ్లెం నుంచి తేజోవంతమైన చిన్న పాటి నక్షత్రంగా సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం వేరుపడింది. ఆ తర్వాత సుమారు 150 కోట్ల సంవత్సరాలకు పూర్తిగా కాంతిని కోల్పోయి గ్రహంగా రూపొందింది. అపుడున్న విపరీత రసాయనిక భౌతిక పరిస్థితుల ప్రభావంతో నిర్జీవమైన పదార్థాల నుంచి తనను తాను ప్రత్యుత్పత్తి చేసుకోగల DNA అణువు ఏర్పడింది. పరిణామక్రమంలో ఇలాంటి DNA లేదా RNAలున్న కణాలు అవతరించాయి. అంటే నేటికి సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం కాలక్రమేణా ఈ భూమ్మీద సూక్ష్మజీవులు ఏర్పడ్డాయి. ఇందులో దాదాపు 99.9 శాతం వరకు ఏకకణ  జీవులే. అవే క్రమేణా జీవ పరిణామం ద్వారా బహుకణ జీవులుగా, జంతువులుగా, వృక్షాలుగా వివిధ జాతుల్ని ఏర్పరిచాయి.అలా నేటికీ వాటి సంఖ్య ఇతర జంతు, వృక్ష జాతులకన్నా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు మన పెద్ద ప్రేగులోనే ఉన్న బ్యాక్టీరియాల సంఖ్య మన సొంత జీవకణాల కన్నా హెచ్చుగా ఉంటాయి.  చివరకు ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులుగా.. కీటకాలుగా, సరీసృపాలుగా, క్షీరదాలుగా ఏర్పడి  కోతి నుంచి మనిషి ఆవిర్భావం జరిగింది. ఇలా జరగడానికి కొన్ని లక్షల ఏళ్లు పట్టింది.

భూమ్మీద సూక్ష్మ జీవులతోనే జీవం పుట్టిందని స్పష్టమైంది. అయితే ఈ సూక్ష్మ జీవుల ఉనికిని క్రీ||పూ 600 సంవత్సరాల కిందట   జైనమత వ్యవస్థాపకుడు మహావీరుడు తదితరులు వూహించారు. కంటికి కనిపించని జీవులు ఉంటాయని భావించారు. కానీ శాస్త్రీయమైన రుజువులు కేవలం క్రీ||శ 17వ శతాబ్దం వరకు లభించలేదు. 1674 సంవత్సరంలో లీకెన్‌ హాక్‌ అనే జీవశాస్త్రవేత్త తొలిసారిగా తానే రూపొందించిన సూక్ష్మ దర్శిని సహాయంతో సూక్ష్మ జీవుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ తర్వాత రోబర్ట్‌ హుక్‌ దాదాపు అదే కాలంలో సూక్ష్మ దర్శిని ద్వారా వివిధ సూక్ష్మ జీవుల్ని పరిశీలించి వర్గీకరించాడు. లూయీ పాశ్చర్‌, స్పల్లంజాని, కోచ్‌ వంటి శాస్త్రవేత్తల ఎనలేని కృషివల్ల సూక్ష్మ జీవుల వల్ల కలిగే అనేక లాభనష్టాల గురించి వివరంగా తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here