ఉసరవిల్లి+మనిషి= మానవ సరీసృపం.. సృష్టిలో అద్భుతం చేయబోతున్న శాస్త్రవేత్తలు..

0
90

chameleonsఉసరవిల్లి+మనిషి= మానవ సరీసృపం.. సృష్టిలో అద్భుతం చేయబోతున్న శాస్త్రవేత్తలు..

ఈ సృష్టిలో ప్రతిదానికి ఓ శక్తినిచ్చాడు దేవుడు. ఆ శక్తి ద్వారానే అవి అహారాన్ని సంపాదించుకొని భూమ్మీద బతుకగలుగుతున్నాయి. అందుకే ఎంతో భీకరమైన సింహాలను పుట్టించిన దేవుడు.. చిన్న చిన్న పురుగులను కూడా పుట్టించాడు. వాటికి తినడానికి, బతకడానికి సరిపడా శక్తి నిచ్చాడు..

‘ఊ.. ఊసరవెల్లి’ అంటూ పిల్లలు.. పెద్దలు ఆసక్తిగా చూసే సరీసృపం గురించి ఓ అద్భుత విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్రిష్ 3 సినిమా గుర్తుందా.. అందులో విలన్ అయిన వివేక్ ఓబేరాయ్ తన జన్యువలును, ఊసరవెళ్లి జన్యవులను కలిపేసి ఊసరవెళ్లి మనిషిని తయారు చేస్తాడు. ఆ మానవ మృగం సినిమాలో నాలుకతో ఐస్ క్రీంలు తినడం.. హీరో క్రిష్ తో పోరాడడం చూశాం.. ఊసరవెళ్లికి ఉండే నాలుకే దానికి ప్రధాన ఆయుధం.. దాంతోనే అది వేటాడుతుందట.. అంతేకాదు ఊసరవెళ్లికి మరో లక్షణం కూడా ఉంటుందని.. అది మనిషికి వస్తే రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు సహా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు..

‘‘అదే వెనుకచూపు’’.. మన కళ్లు ఏదైనా వస్తువును, ప్రదేశాన్ని ఒకవైపే చూడగలం.. వెనుకలా ఏముందో మనం చూడలేం. కానీ ఊసరవెళ్లి ముందు చూడగలదు.. వెనకకు చూడగలదని పరిశోధనల్లో తేలింది. అందుకే అలాంటి చూపును మనిషికి తీసుకురావచ్చా అన్న దిశలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్టు తెలిసింది.

ఉసరవెల్లి ఏకకాలం లో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారం కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచి ఉన్నా శత్రువును పసిగట్టగలదు. ఇదెలా సాధ్యం?.. దీనికి వళ్ళంతా కళ్లు ఉండవు కదా అనే కదా మీ ఫీలింగ్. కానీ ఊసరవెళ్లికి మనలాగే రెండే కళ్లు  ఉంటాయి . కాని కనుగుడ్డు దేనికదే అటు ఇటు తిరుగు తుంది. ఒక కన్ను పైకి చూస్తుంటే , మరొకటి ఎదురుగా గాని , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదైనా ఆహారము , పురుగు దృష్టి లో పడినప్పుడు మాత్రం రెండు కళ్లు దాని మీదే చుపు కేంద్రీకరిస్తుంది ..

మరో విశేషం.. ఏంటంటే..  ఉసరవెల్లి ది బైనాక్యులర్ విజన్ ! .ఈ చూపుతో లక్ష్యన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . దీని నాలుకకు ఉండే జిగురుకు కీటకం అటుక్కుపోతుంది. మరుక్షణం నోటిలోకి లాగేసుకుని గుటుక్కున మింగుతుంది.

ఇలా అడుగుతీసి అడుగు వేయడానికి కష్టపడే ఊసరవెళ్లికి అద్భుత శక్తులున్న విషయం కొంతమందికే తెలుసు.. వాటిని మనం సమకూర్చుకోగలిగితే అద్భుతాలు చేయొచ్చు. ఆ దిశగానే పరిశోధనలు సాగుతున్నాయట.. ఆ మానవ సరీసృపం ఆవిష్కరణ రాబోయే రోజుల్లో చూడవచ్చేమో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here