బల్లి ఎక్కడి పడితే ఏం అరిష్టమో తెలుసా..?

0
570

బల్లి ఎక్కడి పడితే ఏం అరిష్టమో తెలుసా..?

ఎంత హైటెక్ యుగంలో దూసుకుపోతున్నా.. మన సమాజంలో ఇంకా కొన్ని నమ్మకాలున్నాయి. అవి ఎన్నేళ్లు గడిచినా పోవు.. అలాంటి నమ్మకాలను ఎంత చదువుకున్న వారు, మేధావులైనా సరే పాటించాల్సిందే. పిల్లి ఎదురైందని ప్రమాదం జరుగుతుందని మనలో చాలామంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు.. తుమ్ము తుమ్మారని ఓ ఐదు నిమిషాలు ఆగి వెళతారు.. అలాగే ఇంట్లో గోడపై నుంచి బల్లి పడితే అదేదో పెద్ద తప్పుగా భావిస్తారు. బల్లి ఎక్కడ పడిందనే విషయంపైన కూడా పండితులు, పురోహితులు పలు పుస్తకాలు రాశారు. బల్లి ఎక్కడ పడితే ఏం జరుగుతుందనే ఉత్కంఠ చాలా మందిలో ఉంటుంది. అది కింద తెలుసుకుందాం..

* బల్లి మన శరీరంలోని ఏ ప్రాంతంలో పడితే ఏం జరుగుతుందంటే..

తలపై- కలహాలు మొదలవుతాయి..

ముఖము నందు- బందు దర్శనం

ఫై పెదవి యందు- ధనావ్యయం

క్రింద పెదవి యందు- ధనలాభం

ముక్కు చివరాన-రోగం

కుడి చెవి -దేర్ఘాయువు

ఎడమ చెవి- వ్యాపార లాభం

కళ్లపై పడితే-ఖైదు అవుతారు

ముంగురుల పై పడితే- శిక్ష

నుదురు యందు-భయము

కంటమునా-శత్రువు హాని

ఎడమ భుజామున- స్త్రీ భోగము

కుడి మణి కట్టు యందు- కీర్తి

స్తనముల యందు-దోషము

కడుపు మీద- ధనా లాభము

నాభి యందు- ధనా లాభము

పార్శ్వముల యందు-లాభము

తొడల యందు-పిత్రాజీతం

ప్రక్కల యందు-సుఖము

కాళ్ళ యందు-ధన వ్యయం

లింగమున- దారిద్రం

జుట్టు చివరన- మృత్యు భయం

తలమీద నుండి క్రిందకు దిగిన -హాని

బల్లి శరీరంపై ద నుండి పైకి పాకిన, వెంటనే క్రిందకు దిగినను మంచిది

శరీరంఫైనా ఎక్కడ బల్లి పడినా  వెంటనే శిర స్నానము చేసి నూనెతో దీపం పెట్టి దోష నివారణా చేసుకొని ,ఇష్ట్ట దైవ ప్రాద్దన చేసుకుంటే ఎలాంటి దోషాలు ఉండవని పురోహితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here