‘అజ్ఞాతవాసి’ మూవీ రివ్యూ

0
244

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా బుధవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మంగళవారం రాత్రి చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఎన్నో విభేధాలు, ఊహాగానాలు, వివాదాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి మూవీతో పవన్, త్రివిక్రమ్ లు హ్యాట్రిక్ కొట్టారా.? లేదా అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

*కథ ఏంటంటే..

ప్రముఖ వ్యాపారవేత్త గోవింద్ భార్గవ్ పాత్ర పోషించిన హిందీ నటుడు బొమన్ ఇరానీ, ఆయన భార్య విందా పాత్ర కుష్భు నటించారు. ఒకానొక సమయంలో గొవింద్ కొడుకుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. దీంతో కొడుకు లేని లోటును తీరుస్తూ వ్యాపార వ్యవహారాల్ని చూసుకునే ఓ ఉద్యోగిగా పవన్ కళ్యాణ్ నటించారు. బాలసుబ్రహ్మణ్యం పేరుతో గోవింద్ కంపెనీలో పర్సనల్ మేనేజర్ గా పవన్ చేరతాడు. కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ గోవింద్ కొడుకు హత్యకు కారణాలేంటి.? ఎవరు హత్య చేశారనే కోణంలో నిందితుల కోసం అన్వేషిస్తుంటాడు. ఇందులో సీతారామ్ పాత్ర పోషించిన విలన్ ఆది పినిశెట్టి పాత్ర ఏంటి.? అసలు అస్సాం నుంచి వచ్చింది నిజంగా బాల సుబ్రహ్మణ్యమేనా? అజ్ఞాతవాసిగా అతను ఎందుకు వచ్చాడు.? అతనికి కంపెనీ యజమాని గోవింద్ కుటుంబానికి సంబంధం ఏంటి.? అనేది కీలకంగా తెరకెక్కించాడు డైరెక్టర్ త్రివిక్రమ్.

*సినిమాలో ఎవరు ఏం చేశారు.?

ప్రఖ్యాత దుబాయ్ సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ చెప్పినట్టు అజ్ఞాతవాసిలో పవన్ వన్ మ్యాన్ షో చేసినట్టు అర్థమవుతుంది. ఇక దర్శకుడు త్రివిక్రమ్.. పవన్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలకంటే ఈ సినిమా బాగుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ కు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో పవన్ కళ్యాన్ చెలరేగిపోయాడనే చెప్పవచ్చు. ఇక హీరోయిన్స్ కీర్తి సురేష్, అను పోటాపోటీగా నటించారు. సినిమాలో విలన్ ఆది పినిశెట్టి పాత్ర హైలెట్ గా నిలిచింది. ఇక సీనియర్ నటి కుష్బు, పవన్ ల మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి. రావు రమేశ్, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్ అంచనాలకు తగ్గట్లే నటించారు.

* సినిమా ఎలా ఉందంటే..

సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. నిర్మాత చినబాబు పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. కాంటెంట్ పరంగా పీక్స్ లో ఉండగా సినిమా టేకింగ్ కూడా బాగానే ఉంది. ఇక సినిమాటోగ్రఫీ మనికందన్ పనితీరు సూపర్ గా ఉంది. ప్రతి ఫ్రేము ఆడియన్స్ ను ఆకట్టుకునేలా చేసింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవించందన్ సినిమాలోని పాటలను ఇరగదీశాడు. బయటకొచ్చి చూస్తే, గాలివాలుగా.. స్వాగతం కృష్ణా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక కోటగిరి వేంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. రచయిత దర్శకుడిగా త్రివిక్రమ్ ఈ సినిమాతో హైట్రిక్ కొట్టాడనే చెప్పుకోవాలి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల ద్వారా త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో అజ్ఞాతవాసి వచ్చి చేరింది. త్రివిక్రమ్ అంచనాలు ఈ సినిమాతో నిజమయ్యాయి..

* తుది తీర్పు..

త్రివిక్రమ్ ఈ సినిమా మంచి కథ, కథనంతో ప్రేక్షకుల్ని అలరింపచేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం.. హీరోయిన్లతో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టించడం వల్ల ఫస్ట్ హాఫ్ కొంత మైనస్ గా చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ లో కథ రివీల్ అయినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సాదాసీదాగా సాగాయి. కానీ పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్ సీన్స్ చిత్రాన్ని నిలబెడుతూ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా హిట్టా లేక యావరేజ్ టాక్ సొంతం చేసుకుందా తెలియాలంటే రెండు మూడు రోజులు ప్రేక్షకులు తీర్పు ఇచ్చే వరకు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here