నామినేషన్ తిరస్కరణ: రోడ్డుపై ధర్నాకు దిగిన హీరో విశాల్, కోర్టుకెక్కే ఆలోచన!

0
150

నామినేషన్ తిరస్కరణ: రోడ్డుపై ధర్నాకు దిగిన హీరో విశాల్, కోర్టుకెక్కే ఆలోచన!

 

చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యాలని తహతహలాడిన ప్రముఖ బహుబాష నటుడు, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్ కే నగర్ లో పందెంకోడి విశాల్ పోటీ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది.

జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విశాల్ ఉర్రూతలూగాడు. నామినేషన్లు వెయ్యడానికి సోమవారం చివరికి రోజు కావడంతో ఆత్రుతగా విశాల్ నామినేషన్ వేశారు. మంగళవారం ఆర్ కే నగర్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు.

 

 

హీరో విశాల్ ఎన్నికల కమిసన్ నియమాలు ఉల్లంఘించారని, నామినేషన్ పత్రాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ఆర్ కే నగర్ లో పోటీ చేసి తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నించిన విశాల్ కు మొదటి సారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ నామినేషన్ కంటే ముందు జయలలిత మేనకోడలు దీపా నామినేషన్ తిరస్కరించారు.

తన నామినేషన్ తిరస్కరణపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో విశాల్ ఉన్నారు. తన నామినేషన్ తిరస్కరించిందుకు నిరసగా ఆయన అభిమానులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగారు.ఉద్దేశ్యపూర్వకంగానే తన నామినేషన్ తిరస్కరించారని ఆయన ఆరోపించారు. పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విశాల్‌ను  పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here