చైనావారి జ్యోతిష్యం ప్రకారం 2018లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇలా తెలుసుకోండి

0
466

చైనావారి జ్యోతిష్య శాస్త్రం కూడా శక్తి వంతమైనదే. చైనాలోని  జ్యోతిష్యం కూడా ప్రపంచంలోని ప్రతి వ్యక్తులకు వర్తిస్తుంది. 2018 సంవత్సరానికి సంబంధించి పలు విషయాలను చైనీస్ జ్యోతిష్యం వివరిస్తోంది. మన భారతీయ జ్యోతిష్యంలో ఎలాగైతే 12 రాశులుంటాయో చైనావారి జ్యోతిష్యం ప్రకారం కూడా కొన్ని రాశులుంటాయి.

 

అయితే చైనా వారి జ్యోతిష్యానికి మన జ్యోతిష్యానికి రాశుల పేర్లలో తేడా ఉంటుంది. చైనీయుల జ్యోతిష్యం ప్రకారం మీరు జన్మించిన సంవత్సరాన్ని బట్టీ మీ రాశి ఉంటుంది. ఈ పైన ఇచ్చిన ఫొటోలో సంవత్సరాల ప్రకారం ఆ రాశికి సంబంధించిన జంతువుల ఫొటోలను కూడా ఇచ్చాం. దాని ప్రకారం మీరు ఏ సంవత్సరంలో జన్మించారు.. మీకు సంబంధించిన జంతువు ఏమిటో చెక్ చేసుకోండి. తర్వాత 2018లో మీకు కుటుంబపరంగా, వైవాహిక జీవితంపరంగా, దాంపత్యపరంగా, ఇతర లైంగిక సంబంధాలు ఏర్పడడం తదితర విషయాలు తెలుసుకోండి.

 

ఎలుక

ఎలుకకు సంబంధించిన సంవత్సరంలో పుట్టిన వారు 2018లో చాలా హ్యాపీగా ఉంటారు. పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది. అలాగే మరికొందరి విషయంలో గతంలో ఎప్పుడో పరిచయం ఉన్న వ్యక్తులతో మళ్లీ సంబంధాలు కొనసాగుతాయి. మీరు పెండింగ్ లో ఉంచిన ఎన్నో పనులు 2018 లో పూర్తి చేస్తారు. 2018 మీకు చాలా వరకు కలిసొస్తుంది.

 

ఎద్దు

ఎద్దుకు సంబంధించిన సంవత్సరంలో పుట్టిన వారు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. వీరు విశ్వాసపాత్రులు. అయితే వీరికి నమ్మకం గల భార్య దొరకడం కష్టం. వీరికి 2018లో చాలా వరకు అంతా బాగానే జరుగుతుంది.

 

పులి

పులికి సంబంధించిన సంవత్సరాల్లో జన్మించిన వారు 2018లో చాలా సంతోషంగా ఉంటారు. ఇనాళ్లు వీరు అనుభవించిన కష్టాలు దాదాపు 2018లో ముగుస్తాయి. వీరికి ఇక అన్నీ మంచి రోజులే. వీరు ఇక నుంచి జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

 

కుందేలు

కుందేలుకు సంబంధించిన సంవత్సరాల్లో జన్మించిన వారు 2018లో ఆనందంగా ఉంటారు. అయితే ప్రేమకు సంబంధించిన విషయంలో వీరు 2018లో కూడా సక్సెస్ కాలేకపోవొచ్చు. గట్టిగా ప్రయత్నిస్తే ప్రేమలో విజయవంతం కావొచ్చు. గతంలో అనుభవించిన ఇబ్బందులతో పోల్చుకుంటే 2018లో వీరు కాస్త తక్కువగానే సమస్యలను ఎదుర్కొంటారు. పెద్దగా సమస్యలుండవు.

 

డ్రాగన్

2018లో డ్రాగన్ కు సంబంధించిన సంవత్సరాల్లో జన్మించిన వారు చాలా ఆనందంగా ఉంటారు. వీరికి కొత్తకొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వీరు జీవితంలో ఊహించని కొన్ని పరిణామాలు ఎదుర్కొంటారు. అయితే 2018 స్టార్టింగ్ లో వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా కొన్ని రోజుల తర్వాత వీరికి అన్నీ మంచి రోజులే ఉంటాయి.

 

పాము

వీరు కాస్త పిరికివాళ్లుగా ఉంటారు. అలాగే జనాల మధ్యకు రావాలన్నా, జనాలతో మాట్లాడాలన్నా కాస్త సిగ్గు పడుతుంటారు. వీరు తమ జీవితం ఒక పద్ధతి ప్రకారం సాగాలని కోరుకుంటారు. అలాగే వీరు తమ స్నేహితులను కూడా తమలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లనే ఎన్నుకుంటారు. జీవితభాగస్వామి కూడా వీరిలాంటి వ్యక్తిత్వమే కలిగి ఉండాలని కోరుకుంటారు.

 

గుర్రం

గుర్రానికి సంబంధించిన సంవత్సరాల్లో జన్మించిన వారు 2018లో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం పాటు వీరికి పెద్దపెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 2018 వీరు ఊహించిన పరిణామాలను ఎదుర్కొంటారు. అలాగే కొన్ని విషయాల వల్ల వీరు జీవిత భాగస్వామితో కూడా సంబంధాలను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

 

మేక

మేకకు సంబంధించిన సంవత్సరాల్లో జన్మించిన వారు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరు సంసారపరంగా కష్టాలను ఎదుర్కొంటారు. అయితే వీరు వారి జాబ్ పరంగా మాత్రం హ్యాపీగానే ఉంటారు. 2018లో వీరు కొన్ని రకాల కష్టాలను ఎదుర్కొంటారు.

 

కోతి

2018లో వీరికి అంతగా సమస్యలు ఎదురుకావు. వ్యక్తిగతంగా వీరు ఆనందంగా ఉంటారు. ఇక పెళ్లికాని వ్యక్తులైతే చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఇక పెళ్లి అయిన వ్యక్తులు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

కోడిపుంజు

వీరు కూడా 2018లో భాగస్వామితో చాలా హ్యాపీగా ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక పెళ్లికానీ వ్యక్తులకు మంచి భాగస్వామి దొరికే అవకాశం ఉంది.

 

కుక్క

వీరు 2018లో సంతోషంగా ఉంటారు. వీరికి ఇతర వ్యక్తులతో కొన్ని రకాల సంబంధాలు ఏర్పడుతాయి. వీరు వద్దనుకున్నా కూడా అమ్మాయిలతో పరిచయాలు, సంబంధాలు ఏర్పడుతాయి. అందువల్ల వీరు 2018లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

 

వరాహం

వీరు 2018లో వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. పెళ్లికాని వారికి వివాహం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే కొందరి మహిళలతో మీకు సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో మీరు కాస్త లిమిట్ లో ఉండాలి. విచ్చలవిడిగా ఇతర అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తే మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here