రూ.1349కే స్మార్ట్ ఫోన్.. జియోకు ఇది పెద్ద షాక్

0
205

రూ.1349కే స్మార్ట్ ఫోన్.. జియోకు ఇది పెద్ద షాక్ ..

టెలికాం ఆపరేటర్ల మధ్య పోటీ దేశంలోని వినియోగదారులకు మేలు చేస్తోంది. అప్పటివరకు అప్రతిహతంగా సాగిన టెలికాం రంగంలో ముఖేష్ అంబానీ జియో నెట్ వర్క్ తో ప్రవేశించి డేటా, కాల్స్ రేట్లను నేలకు దించాడు. ఈ దెబ్బకు అప్పటివరకు 300కు పైగా పెడితే కానీ దొరకని 1జీబీ డేటా సేవల్ని ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు తగ్గించాల్సి వచ్చింది. ఈ తగ్గుదల వాటికి నష్టాలను మిగిల్చగా జియోకు మాత్రం తన ఉచిత ఆఫర్ల వానను కొనసాగించింది..

ఆ కోవలోనే జియో 4జీ ఫీచర్ ఫోన్ ను కేవలం రూ.1500 కే లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. ఈ ఫీచర్ ఫోన్ కోసం జనం ఎగబడడం దాదాపు 60లక్షల ఫోన్లకు పైగానే ఒకేరోజు బుక్ చేయడంతో జియో ఆదరణ ఎక్కువైపోయింది. దీంతో మేల్కొన్న దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ ఎట్టకేలకు దేశీయ మొబైల్ తయారీ కంపెనీ సెల్ కాన్ తో జతకట్టింది. సేమ్ జియో అనుసరించి క్యాష్ బ్యాక్ ఆఫర్ తో కేవలం 1349 రూపాయలకే 4జీ స్మార్ట్ ఫోన్ ను ఇస్తున్నట్టు ప్రకటించింది. మొదట వినియోగదారులు 2849 చెల్లించి కొంటే మూడేళ్ల తర్వాత రూ.1500 తిరిగి ఇచ్చేస్తారు. దీంతో వినియోగదారు కేవలం 1349 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నమాట..

జియో అందించే ఫీచర్ ఫోన్ కంటే ఎయిర్ టెల్ అందించే స్మార్ట్ ఫోన్ అన్ని రంగాల్లో మెరుగ్గా ఉండడం పైగా రూ.1349కే అందిస్తుండడంతో జియోకు ఇది పెద్ద షాక్ ఇచ్చినట్టు అయ్యింది. మరి జియో కూడా ఫీచర్ ఫోన్ కు స్వస్తి పలికి స్మార్ట్ ఫోన్ ను తయారు చేసే పనిలో పడిందట.. ఏదీ ఏమైనా ఎయిర్ టెల్, జియో పోటీతో కాల్స్, డేటా ధరలు దిగివచ్చి వినియోగదారులకు మేలు జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here