మొలకెత్తిన గింజలు ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా.?

0
361

మొలకెత్తిన గింజలు ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా.?

మనకు లభిస్తున్న అన్ని రకాల ఆహార పదార్థాలలోకెల్లా మొలకెత్తిన గింజలు పూర్తిస్థాయి పోషకాలను అందిస్తాయి. శరీరం చురుకుగా ఉండాలంటే వారంలో కనీసం ఒకసారైనా మొలకెత్తిన గింజలను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజలు అధిక బరువును తగ్గించేందుకు కూడా చక్కగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలు కూడా లభిస్తాయి. అలాకాకుండా ఉడకబెట్టినా, వేడి చేసినా వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. ఈ గింజలతో పచ్చి క్యారెట్లను కలిపి తింటే శరీరానికి కావాల్సిన బీటా కెరోటిన్‌ సమృద్ధిగా అందుతుంది.

మొలకెత్తిన గింజలను నిత్యం మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటితో ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా వీటివల్ల గ్యాస్‌, ఎసిడిటీ తదితర సమస్యలు దూరమవుతాయి. మొలకెత్తిన గింజలలో క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే విటమిన్‌ బి, సిలు వీటిలో ఎక్కువగా ఉంటాయి.

మొలకెత్తిన గింజలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మధ్యాహ్న సమయంలో మాంసాహారం తింటే సాయంత్రం స్నాక్స్‌లో మొలకెత్తిన గింజలు తినడం బెటర్‌. ఎందుకంటే మాంసాహారం నుంచి వచ్చే అధిక కొవ్వు బారి నుండి గింజలు మనల్ని రక్షిస్తాయి. మాంసంలోని కొవ్వును పీల్చుకోవడం ద్వారా దాన్ని శరీరంలోని ఇతర వ్యర్థపదార్థాలతో కలిపి బయటికి పంపిస్తాయి. వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here