బోర్ కొట్టినప్పుడల్లా అదే పని.. 100మందికి పైగా రోగాలతో ఏం చేసిందో తెలిస్తే షాక్..

0
216

బోర్ కొట్టినప్పుడల్లా అదే పని.. 100మందికి పైగా రోగాలతో ఏం చేసిందో తెలిస్తే షాక్..

డాక్టర్లు, నర్సులు.. ప్రమాదంలో ఉన్న రోగులను కాపాడే దేవుళ్లతో సమానం.. కానీ ఈ  నర్సు 100 మందికిపైగా రోగులను బలి తీసుకోవడం సంచలనమైంది. తనకు బోర్ కొట్టడం వల్లే ఈ పని చేశానని సదరు నర్సు చెప్పడం గమనార్హం. జర్మనీకి చెందిన 41 ఏళ్ల నీల్స్ హోగెల్ రెండు హత్య కేసులు, మరో నాలుగు హత్యాయత్నం కేసుల్లో విచారణ ఎదుర్కొన్నాడు. ఐసీయూలో ఉన్న పేషెంట్లను చంపడం లేదా ప్రాణాపాయం కలిగించాడని ఆరోపిస్తూ కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు హోగెల్ దిమ్మతిరిగే వాస్తవాలను వెల్లడించాడు. 90 మందికిపైగా పేషెంట్ల ప్రాణాలను గాల్లో కలిపానని హోగెల్ చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.

1999 నుంచి 2005 మధ్యకాలంలో హోగెల్ రెండు ఆసుపత్రుల్లో పనిచేశాడు. 90 మంది రోగులే కాకుండా అదనంగా మరో 16 మంది ప్రాణాలను కూడా అతడు బలి తీసుకున్నాడని విచారణాధికారులు నిర్ధారించారు. మరో ఐదు కేసుల్లో విషప్రయోగంతో చంపేశాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టర్కీకి చెందిన ముగ్గురు పేషెంట్ల డెడ్ బాడీలను వెలికి తీసి పరీక్షలు నిర్వహించే దిశగా అడుగులేస్తున్నారు.

పేషంట్ల శరీరంలోకి ఇంజెక్షన్ రూపంలో డ్రగ్స్ ఇవ్వడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినేది. తర్వాత అతడు వారిని కాపాడేందుకు ప్రయత్నించేవాడు. పేషెంట్ బతికితే.. డాక్టర్ల దగ్గర వాళ్ల ప్రాణాలను కాపాడిన క్రెడిట్ కొట్టేసేవాడు. పేషెంట్ల ప్రాణాలను ఇబ్బందుల్లోకి నెట్టి.. తిరిగి కాపాడినప్పుడు ఆనందించే హోగెల్ వాళ్లు చనిపోయినప్పుడు మాత్రం బాధపడినట్లు నటించేవాడు. బోర్ కొట్టినప్పుడు కూడా ఇలా చేసేవాడు.

2005లో హాస్పిటల్లో పేషెంట్‌కు హోగెల్ ఇంజెక్షన్ ఇస్తుండగా ఓ నర్సు చూసింది. ఆ పేషెంట్‌ను కాపాడి హోగెల్‌ను అరెస్ట్ చేశారు. అనేక హత్యాయత్నం కేసుల్లో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2008లో తీర్పు వెలువడింది. మీడియాలో హోగెల్ గురించి వార్తలు రావడంతో తన తల్లి చనిపోవడానికి అతడే కారణం కావచ్చని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనేక శవాలను బయటకు తీసి పరీక్షించారు. వారిలో ఐదుగురికి డ్రగ్ ఇచ్చి ఉండొచ్చనే అభిప్రాయానికి వచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారిపై, ఏ మాత్రం అనుమానం రాకుండా హోగెల్ ఇలా చేసేవాడని, జర్మనీ చరిత్రలోనే ఇది అరుదైన కేసు అని విచారణాధికారి తెలిపారు. ఎంత మందిని చంపేశాడో హోగెల్‌కే సరిగా గుర్తులేకపోవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here