బీ అలెర్ట్: కిడ్నీల ఫెయిల్యూర్ సూచించే సీరియస్ సంకేతాలు..

0
227

బీ అలెర్ట్: కిడ్నీల ఫెయిల్యూర్ సూచించే సీరియస్ సంకేతాలు..

శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. బీపీ, ఎలక్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. కానీ డయాబెటిస్, హై బీపీ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది. కిడ్నీల పనితీరు మందగిస్తే.. శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. కాబట్టి ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. ఇటీవల చాలామంది కిడ్నీల ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 90 శాతం మంది ఇండియన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లేనని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

రక్తంలోని అనవసర పదార్థాలను ఫిల్టర్ చేయడమే కిడ్నీల ప్రధాన ప్రక్రియ. ఫ్యాటీ యాసిడ్స్, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం ఎక్కువవుతోంది. దీనివల్ల పరిమితికి మించి కిడ్నీలపై ఒత్తిడి పెరగడం వల్ల కిడ్నీల ఫెయిల్యూర్ సమస్యలు పెరుగుతున్నాయి. కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడ కొంత మందిలో అలసట, దురద, వీక్ బోన్స్, జాయింట్ ప్రాబ్లెమ్స్, డిప్రెషన్, ఆకలి తగ్గిపోవడం మరియు లెగ్ క్రాప్ లక్షణాలు కనబడుతాయి. ఇదంతా కిడ్నీలకు చేరే రక్తంలో వ్యర్థాలు ఎక్కువ అవ్వడం వల్ల చివరి పరిస్థితుల్లో ఇటాంటి లక్షణాలు కనబడుతుంటాయి. దీన్ని యురేమియాగా సూచిస్తారు . కిడ్నీ ఫెయిల్యూర్ కు అనేక కారణాలున్నాయి. ఒక వేళ క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదా కిడ్నీలను మార్పు చేసుకోవాలి . అయితే కిడ్నీలు పూర్తిగా పాడైపోయినప్పుడు కలిపించే లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి కనపడితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే లెక్క…

* మూత్రం తగ్గిపోవడం:

ఇంతక ముందుకంటే ఇప్పుడు మూత్రం సరిగా పోకుంటే..ఆవరేజ్ కంటే తక్కువగా మూత్రవిసర్జన చేసినప్పడు. అంటే రోజులో ఒకటి రెండు సార్లు మాత్రమే పోతుంటే, ఖచ్చితంగా కిడ్నీలను టెస్ట్ చేయించుకోవాల్సిందే..

 

*శరీరంలో వాపులు

ఓడిమా ఇది శరీరానికి సంబంధించినది. శరీరంలో అక్కడక్కడ వాపులు వస్తాయి. శరీరంలో ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల ఇలాంటి లక్షణాలు కనబడుతాయి. ఓడిమా కిడ్నీఫెయిల్యూర్ లక్షణాలు ఒక సీరియస్ సంకేతం కావచ్చు.

*నీరసం, తీవ్రమైన అలసట

ఎరిత్రోపోయిటిన్ అనే హార్మోన్ ను కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి, ఇది ఎర్రరక్తకణాలు ఆక్సిజన్ సరఫరా చేయడానికి సహాయపడుతాయి. కిడ్నీల్లో ఎరిత్రోపోయిటిన్ తక్కువగా ఉన్నప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తహీనతకు గురిచేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు నీరసం మరియు తీవ్రమైన అలసటకు గురిచేస్తుంది.

*ఆకలి లేకపోవడం:

ఆకలి కాలేదని చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకు కారణాలను మాత్రం తెలుసుకోరు. ఇలా తరచూ జరుగుతుంటే మైనర్ డైజెస్టివ్ లక్షణంగా భావిస్తారు . ఏదేమైనా ఇది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి.

*మెదడు చురుకుదనం తగ్గుతుంది:

మెదడు చురుకుగా పనిచేయదు. మతిమరుపు, లేదా గుర్తించుకోవడంలో ఇబ్బందుల, మూడ్ స్వింగ్స్, మొదలగు లక్షణాలన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కి సంకేతాలే..

*బీపీ పెరిగిపోవడం:

సడెన్ గా హైపర్ టెన్షన్ , డిస్ట్రెస్, బ్లడ్ ఫ్లోలో అసమతుల్యతలు ఏర్పడితే కిడ్నీ ఫెయిల్యూర్ కు సంకేతంగా గుర్తించాలి.

* గుండెకోట్టుకోవడంలో తేడా :

శరీరంలో పొటాషియం హైలెవల్ లో ఉన్నప్పుడు , గుండె కొట్టుకోవడంలో తేడాగా ఉంటుంది. నాడీలో తేడా కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాల్లో ఒకటని గుర్తుంచుకోవాలి.

*అనీమియా :

రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్ గా కంటే తక్కువగా ఉంటాయి . ఇది హీమోగ్లోబిన్ కు సరిపడా లేనప్పుడు , శరీరం మొత్తం ఆక్సిజన్ సప్లై చేయలేదు. ఫలితంగా అనీమియాకు దారితీస్తుంది. నార్మల్ కిడ్నీలు ఎరిత్రోప్రోటీన్ ను సూచిస్తుంది . ఈ హార్మోన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అక్యూట్ కిడ్నీ డిసీజ్ వల్ల అనీమియాకు దారితీస్తుంది . ఎరిథ్రోప్రోటీన్ తక్కువైనప్పుడు అనీమీయాకు దారితీస్తుంది. అనీమియా వస్తే కిడ్నీలకు ప్రమాదమే..

* అల్సర్ తగ్గకపోతే

క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వంటి అడ్వాస్డ్ స్టేజ్ లో ఉంటారో వారిలో గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ డిసీజెస్ అల్సర్ వంటివి పెరుగుతాయి . వీటిని సరైన సమయంలో చికిత్స అందివ్వకపోతే మ్యానేజ్ చేయడం కష్టం అవుతుంది.

* మూత్రంలో రక్తం:

కిడ్నీ వ్యాధులకు ఆందోళకు గురిచేసే ఒక ఖచ్చితమైన కారణం మూత్రంలో రక్తం కనిపించడం ఇది ఒక ప్రధాన లక్షణం. ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఎందుకైన మంచిది, డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

*వెన్నులో లేదా సైడ్ లో నొప్పి ఉండవచ్చు:

కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వ్యాధి వల్ల నొప్పికి కారణం కావచ్చు, కిడ్నీలో రాయి ఉందనుకోండి లోయర్ బ్యాక్ పెయిన్ నుండి గజ్జదిగువల భాగం లోకిని వ్యాప్తిం చెంది ఒక తీవ్రమైన తిమ్మరి నొప్పికి గురిచేస్తుంది . అలాగే పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ , వారసత్వ మూత్రపిండాల లోపంతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు.

పైన లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీ ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. వెంటనే చికిత్స చేసుకోకపోతే అది మీ కడ్నీ పనిచేయకపోవచ్చు.. ప్రాణాలే పోవచ్చు. సో బీ అలెర్ట్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here