బీరు తాగుతున్నోళ్లందరికీ ఇది శుభవార్త..

0
219

బీరు తాగుతున్నోళ్లందరికీ ఇది శుభవార్త..

‘మందు తాగని వాడు దున్నపోతై పుట్టును’ అన్నాడు గిరీశం.. అయినా ఈ కాలంలో మద్యం అలవాటు లేనివాళ్లంటూ చాలా అరుదుగా ఉంటారు.. తాగని వారిని కూడా సమాజంలో అదోలా చూస్తారు. పార్టీలు, పబ్ లలో అమ్మాయిలు సైతం మద్యం తాగుతున్న రోజులువి.. ముఖ్యంగా యువత, ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడేది బీరు.. కానీ ఈ బీరు తాగడం వల్ల కూడా ఓ ప్రయోజనం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.  బీరులో నొప్పిని తగ్గించే గుణాలున్నాయనీ, ఇది పారసిటమల్ మందు కన్నా బాగా పనిచేస్తుందన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది.

లండన్‌లో సుమారు నాలుగు వందల మంది మీద నిర్వహించిన 18 అధ్యయనాలను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని ధృవీకరించారు. నొప్పితో బాధపడుతున్న కొందరికి అధ్యయనకారులు కొంత మొత్తంలో బీరును ఇచ్చారు మరికొందరికి కేవలం నొప్పిని తగ్గించే మందులను మాత్రమే ఇచ్చారు. అనంతరం వీరి నొప్పిని పరిశీలించగా బీరు తాగిన వారిలో నొప్పి కొద్దిగా తగ్గుముఖం పట్టగా, మందులు వేసుకున్న వారిలో ఎలాంటి మార్పును వీరు గమనించలేదు. బీరు తాగిన వారిలో అనవసర ఆందోళన తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించారు. కేవలం బీరు తాగడం వలనే నొప్పి, ఆందోళన తగ్గాయని లైట్ గా బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని తేలింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here