పెరుగు తినే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలివీ..

0
225

పెరుగు తినే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలివీ..

ప్రస్తుతం మనకు అందుబాటులో తక్కువ ధరలో అత్యధిక పోషకాలున్న ఆహార పదార్థాలు ఏవయ్యా అంటే అవి గుడ్లు, పాలు, పెరుగు.. ఈ మూడింటిలో అన్ని పోషకాలుంటాయి కాబట్టే వీటినే సంపూర్ణ ఆహారాలు అంటుంటారు.. మనం రోజూ తినే భోజనం చివరలో పెరుగు లేకపోతే ఆ భోజనం పూర్తి అవ్వదు .. కనీసం రోజులో రెండు పుటల అయిన పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు ఉంటె అది దివ్యౌషధంలా పనిచేస్తుంది.

రోజు పెరుగు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . ఇలా పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి. పాల‌లో మీగ‌డ తీయ‌కుండా త‌యారైన పెరుగును తినాలి . ఎందుకంటే మీగ‌డ తీసిన పెరుగు ద్వారా మనకు తక్కువ పోషకాలు అందుతాయి . ఇక ప‌గ‌టి పూట పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చాలా మేలు క‌లుగుతుంది. వేలైనంతవరకు రాత్రి పూట పెరుగు తగ్గించడం మంచిది..

పెరుగులో ఉండే విటమిన్ కే కారణంగా రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. అలాగే లివర్ సిర్రోసిస్ వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ను దరి చేరకుండా చూసుకుంటుంది .. అంతే కాదు డయోరియాతో బాధపడుతున్నప్పుడు పెరుగు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది, పెరుగు శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఇక పెరుగు రోజు తినే మగ వారిలో సెక్స్ సామర్థ్యంను పెంచడంలోను అదేవిధంగా వీర్యం యొక్క నాణ్యత పెంచడంలోనూ సహాయపడుతుంది.

ఇక ఆడవారి జుట్టు , చర్మ సౌందర్యానికి పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది.. విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్ ఇంకా మైక్రో మినిరల్స్ అధికంగా ఉండి చర్మం రంగును మెరుగుపరుస్తాయి. మొటిమలను మచ్చలను తొలగిస్తాయి. ఏజ్ లెస్ గా కనిపించే టట్లు చేస్తుంది పెరుగు పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళను తగ్గిస్తుంది . పెరుగు వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం . ఇది శరీరంలోపలకూడా ఉండే వేడిని తగ్గించి చల్లని అనుభూతిని కలిగిస్తుంది

ఇక చాలా మంది గేదె పాలు మంచివా ? లేక ఆవు పాలు మంచివా ? అని ఆలోచిస్తూ ఉంటారు .. ఐతే ఆవు పాలతో పోల్చినప్పుడు గేద పాలలో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి . అందుకే గేదె పాలతో తయారుచేసిన పెరుగును తినడం వల్ల జీర్ణం కాదు .. ముఖ్యంగా వయస్సైనవారికి .. కాబట్టి పిల్లలు , పెద్ద వారు ఇద్దరు కూడా ఆవు పెరుగు తినడమే మంచిది .. ఆవు పాలు దొరకటం కష్టం అయినప్పుడు గేదె పాలే తీసుకుంటాం .. పెరుగు ఏదైనా తాజాగా పెరుగు తీసుకోవాలి .. నిల్వ ఉంచిన పెరుగులో బ్యాక్టీరియా చచ్చిపోతుంది .. కాబట్టి పెరుగు తినాలనుకుంటే, పెరుగు పేరబెట్టిన తర్వాత 24 గంటలలోపే తినేసేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here