గబగబా అన్నం తినేవాళ్లకు ఇది షాకింగ్ వార్త

0
175

గబగబా అన్నం తినేవాళ్లకు ఇది షాకింగ్ వార్త

కొందరు తిండిపోతులుంటారు.. కొందరు ఏం పెట్టినా తినరు.. పిల్లలకైతే అన్నం తినిపించడం అనేది తల్లులకు ఒక టాస్క్ గా మారిపోయింది. కొందరు స్లోగా తింటారు. కొందరు రెండు నిమిషాల్లో తిండిని లోపల కుక్కేసి మమ అంటారు. ఇంతకీ ఎలా తింటే మంచిది. వేగంగా తింటే మంచిదా.. ? లేక స్లోగా తినాలా.? గంటలు గంటలు తింటే ఏమైనా నష్టం ఉంటుందా.? అసలు తిండిని ఎలా తినాలనే దానిపై ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఇందులో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.

నెమ్మదిగా తినేవారితో పోలిస్తే.. గబగబా తినే వారికి అధిక రక్తపోటు, లావు అవడం, షుగర్ వ్యాధులతో పాటు గుండెజబ్బులు ముప్పు పొంచి ఉందని హిరోషిమా పరిశోధకులు తేల్చారు. ప్రతి ముద్దను అస్వాదిస్తూ ప్రశాంతంగా తినేవారికి అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. 1000మంది 20-50 ఏళ్ల మధ్య వారిపై ఐదేళ్లు పరిశోధన చేసి మరీ దీన్ని నిర్ధారించారట.. వేగంగా తినేవారికి అల్సర్, హైబీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ ముప్పు ఐదున్నర రెట్లు ఎక్కువగా ఉందని తేల్చారు.. వేగంగా తింటే శరీరంలో గ్లూకోజ్ విడుదల అస్తవ్యస్తమై తొందరగా షుగర్ వ్యాధి వస్తుందని తేల్చారు. సో ఇప్పటికైనా మీరు కంగారుగా తినడం మాని.. కాస్తా సమయం తీసుకొని నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి.. లేకపోతే డేంజర్లో పడతారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here