క్షణాల్లో జలుబుని తగ్గించే సింపుల్ చిట్కా..

0
202

క్షణాల్లో జలుబుని తగ్గించే సింపుల్ చిట్కా..

శ్వాసనాళ వ్యవస్థ(ముక్కు,గొంతు,స్వరపేటిక) పై వైరస్ దాడి చేయడం వల్ల జలుబు వస్తుంది. సాధారణంగా జ్వరముతో కలిగే ముక్కు కారడాన్ని జలుబు అని పిలుస్తారు.సర్వసాధారణంగా మామూలు జలుబు లేదా పడిసం రైనో వైరస్ అనే వైరస్ క్రిమి వల్ల , లేదా కొరోనా అనే వైరస్ ల వల్ల కలుగుతుంది. వాతావరణంలో ఉండే ఈ వైరస్ లు దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం(ముక్కు దిబ్బడ) దీని ముఖ్యమైన లక్షణాలు.

వర్షాకాలం, చలికాలం వస్తే చాలు అప్పటివరకూ ఎక్కడ వుంటుందో తెలియదు కాని ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పిల్లలు స్కూలుకు వెళ్లెవరకూ బాగానె వుంటారు కాని తిరిగి ఇంటికి వచ్చేటప్పటికీ నీరసంగా వస్తారు. జలుబు అంటుకోగానే ఒకటే ఒళ్లు నొప్పులు, గొంతు, తలనొప్పి, జలుబు, జ్వరం… ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపిస్తాయి. కొందరికి ఒకటే తుమ్ములు, మరికొందరికి దగ్గు కనిపిస్తుంది.  పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలకు కొన్ని నివారణ సూచనలు. ఇవి ఇంట్లోనే చేసుకునే సులవైన చిట్కాలు పాటించండి..

వాము లేదా వామ్ము.. , ఓమ.. పేరేదైనా కేవలం వంటల్లోనే కాదు అనారోగ్యాలను తరిమి కొట్టడంలోనూ వాము ఉపయోగపడుతుంది. వాము వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, సువాసన వస్తుంది. అలాగే, ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది.

 

వామును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా నలపాలి. అనంతరం ఆ పొడిని శుభ్రమైన వస్త్రంలో కట్టి దాన్ని వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే జలుబు వెంటనే తగ్గుతుంది. ఈ సమస్యకు ఆవిరిపట్టడం కూడా ఉపశమనం ఇస్తుంది. ఇన్ హెలర్లవాడకం ఎంతమాత్రం మంచిది కాదు.. ఇక యాంటిబయటిక్స్ వాడితే మీ లివర్ కు ఎఫెక్ట్.. దీంతో వాముపొడితో వాసన పీలిస్తే ఎంతో బెటర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here