కొత్త ఆవిష్కరణ.. షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఇది తాగితే చాలట.. 

0
210

కొత్త ఆవిష్కరణ.. షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఇది తాగితే చాలట..

షుగుర్ వ్యాధి.. ప్రస్తుతం అస్తవ్యస్తమైన మన ఆహారపు అలవాట్ల ఫలితంగా తేలికగా వస్తున్న వ్యాధి. ఈ వ్యాధికి మందు లేదు. ఒంట్లోని షుగర్ ను కంట్రోల్ లో పెట్టడానికి రోజూ టాబ్లెట్లు, ఇంజక్షన్ లు వేసుకోవాల్సిందే.. 35 ఏళ్లు దాటితే చాలా వచ్చేస్తున్న ఈవ్యాధి మనం చచ్చేవరకు బాధిస్తూనే ఉంటుంది.  ఈ వ్యాధి నివారణకు ఎన్నో పరిశోధనలు సాగుతున్నా ఇంకా కొలిక్కి రావడం లేదు. అయితే ఇప్పుడు కొత్త పరిశోధన ఆశలు రేపుతోంది.

పరిమితంగా రెడ్ వైన్, డార్క్ చాక్లెట్‌లను తీసుకునే మహిళల్లో డయాబెటిస్ ముప్పు తక్కువని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లను తీసుకొని వారితో పోలిస్తే అధికంగా తీసుకునే మహిళల్లో డయాబెటిస్ ముప్పు 27 శాతం తక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైంది.

మనం తీసుకునే ఆహారానికి, టైప్-2 డయాబెటిస్ మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనం మరోసారి బటయపెట్టింది. డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని కాపాడుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా కణాలు దెబ్బతిని, డయాబెటిస్‌కు దారి తీస్తుంది.

వైన్ తీసుకుంటే డయాబెటిస్ ముప్పు తగ్గడం నిజమే కానీ, అధిక మోతాదులో తీసుకోవద్దని చెబుతున్నారు. రోజుకు అర గ్లాస్ నుంచి గ్లాస్ లోపు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నా, బాడీ మాస్ ఇండెక్స్ అధికంగా ఉన్నప్పటికీ.. వైన్ కారణంగా డయాబెటిస్ ముప్పు తగ్గుతున్నట్లు తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here