ఒక చెంచాడు రాత్రి దీన్ని వాడితే మలబద్ధకం మటుమాయం..

0
219

ఒక చెంచాడు రాత్రి దీన్ని వాడితే మలబద్ధకం మటుమాయం..

ఒంటికి, రెంటికి క్రమంగా పోవాలి.. లేదంటే ఆ రోజు రోజులగా గడవదు.. ముఖ్యంగా ఉదయం లేవగానే మోషన్ ఫ్రీగా అయిపోతే శరీరం తేలికగా అయిపోతుంది. మనసు సైతం ఉత్తేజితమవుతుంది. పాపం.. మలబద్ధకం సమస్యను తీవ్రంగా ఫేస్ చేసేవారికి మాత్రం ఉదయాన్నే మోషన్ అయిపోతే ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ ఆధునిక కాలంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్దకం. దీనికి కారణం చెప్పాలంటే  మారిన జీవన విధానం, చిరుతిండ్లు, ఒత్తడితో కూడుకున్న పని, ఫైబర్ కంటెంట్ లేని ఆహారం, అదీ లేట్ నైట్ తినడం, జీర్ణక్రియను, లివర్ పనితీరును మందగింపజేసే అనేక బ్యాడ్ హ్యాబిడ్స్… వెరసి ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా చాలా ఆయాస, ప్రయాసలు పడాల్సిన దుస్థితి.

రెండు రోజులు మోషన్ కి పోకపోవడాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడాలా అని అనుకునే వారున్నారు.. ఎందుకంటే మనకు వచ్చే అనేక రకాల వ్యాధులు, శారీరక రుగ్మతలకు మలబద్ధకం మూలకారణం అవుతుంది. మీకు తెలుసో లేదో? ఏదయినా అనారోగ్యంతో డాక్టర్ ను సంప్రదిస్తే.. మీకు రెగ్యులర్ గా మోషన్ అవుతుందా అని అడుగుతారు? అది ఏ రంగులో ఉంది? ఇబ్బంది అవుతుందా? ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఎందుకనుకున్నారు. మన అనారోగ్యానికీ, మలబద్దకానికీ ఉన్న లింక్ అది. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీలు, హార్ట్ సమస్యలకు రెగ్యులర్ గా మెడిసిన్ వాడే వారితో పాటుగా అనారోగ్యం పాలయిన వారికి ఉదయం మోషన్ ఫ్రీ కావడానికి కూడా ఓ ట్యాబ్లెట్ తప్పనిసరిగా ఇస్తుంటారు. అంటే ఏ వ్యాధి నయం కావాలన్నా మలం కూడా ఎప్పటికప్పుడు సాఫ్ గా బయటికి పోవాలన్నమాట. ఇదంతా సరే ఇంగ్లిష్ మెడిసిన్ వాడకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను అదిగమించొచ్చా? ఖచ్చితంగా అధిగమించవచ్చు.. అది ఎలాగంటే..

త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి జీర్ణక్రియను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీర జీవక్రియల ఫంక్షన్ లో కణాలు యాక్టివ్ గా ఉండేలా ఎఫెక్టివ్ గా దోహదం చేస్తాయి. శరీర అవయవాలు, కణజాలాలకు వృద్ధాప్య చాయలు రాకుండా అడ్డుకుంటాయి. అంతటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను ఇచ్చే త్రిఫల చూర్ణం అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతుంది. జీర్ణక్రియ సంబంధించిన చాలా సమస్యలు త్రిఫల ద్వారా బాగా నియంత్రించబడతాయి. అంతేకాక ఇది ఒక విరేచనకారిగా పని చేస్తుంది. కొవ్వు జీర్ణం కావాలంటే లివర్ యాక్టివ్ గా పనిచేయాలి. ఈ పనిలో లివర్ కు శక్తినిచ్చే పనిని త్రిఫల చూర్ణం గొప్పగా చేయగలదు. పేగుల్లో పీహెచ్ స్థాయిలను సరిగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది.

అందుకే మలబద్ధకంతో బాధపడుతున్న వారు దీనిని పొడి రూపంలో తీసుకుంటే సరి. రాత్రి వేళ గోరువెచ్చని నీటిలో ఓ అర స్పూన్ త్రిఫల పొడిని వేసుకుని నిద్రకు పావుగంట ముందు తాగండి. తెల్లవారే సరికల్లా మీ మలబద్దకం ఎలా వదిలిపోతుందో మీరే చూస్తారు. అయితే కొద్ది రోజులు క్రమం తప్పకుండా వాడితే మీ శరీరాన్ని డెటాక్సిఫై చేస్తుంది. కొవ్వును కూడా కరిగిస్తుంది. ఇది ఊబకాయం ఉన్నవారి దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఔషధం. క్రమం తప్పకుండా దీనిని వాడితే పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. కొవ్వు చేరటానికి కారణమైన కొవ్వు కణజాలాన్ని త్రిఫల బాగా నియంత్రిస్తుంది. సో చాలా శరీర సమస్యలకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ త్రిఫల చూర్ణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here