ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే మీ ఫోన్ ఫుల్ చార్జింగ్

0
191

ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే మీ ఫోన్ ఫుల్ చార్జింగ్..

స్మార్ట్ ఫోన్ .. ప్రస్తుతం అరచేతిలో అది లేనిదే పనిగడవదు.. స్మార్ట్‌ఫోన్‌ల పై అతిగా ఆధారపడుతోన్న నేపథ్యంలో వాటి పై మరింత ఒత్తిడి పెరిగి బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవటం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫోన్‌లను మరింత వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయా మార్గాలను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అన్వేషిస్తున్నారు. దీనిపై ఫోన్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆండ్రాయిడ్ కూడా విస్తృత పరిశోధనలు చేస్తోంది..

ఆండ్రాయిడ్ తన మిడ్ రేంజ్ ఇంకా టాప్ ఎండ్ ఫోన్‌లను రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందిస్తోంది. ఈ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫోన్ బ్యాటరీలను వేగవంతంగా ఛార్జ్ చేయటంతో పాటు వాటి పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. ఐఫోన్‌ బ్యాటరీలను వేగవంతంగా ఛార్జ్ చేయగలిగే ఎటువంటి రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీలను యాపిల్ ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయింది!. ఐఫోన్ యూజర్లకు ఇది కాస్తంత నిరుత్సాహానికి గురి చేసే అంశమే.

ఆండ్రాయిడ్ యూజర్లు ఈ మార్గాల ద్వారా తమ డివైస్ బ్యాటరీని 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తిగా చార్జ్ చేసుకునేందుకు పలు మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది… ఆండ్రాయిడ్ సూచించిన పలు ఆంశాల ఆధారంగా ఇలా చార్జింగ్ పెట్టుకోండి..

1.  మీ ఆండ్రాయిడ్‌లో Airplane Modeను ఎనేబుల్ చేసి ఛార్జింగ్ సాకేట్‌కు కనెక్ట్ చేయటం ద్వారా ఫోన్ నిమిషాల వ్యవధిలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

2. ఆండ్రాయిడ్‌లు హీట్ సెన్సిటివ్ కాబట్టి, మీ ఆండ్రాయిడ్‌ను ఛార్జ్‌లో ఉంచినపుడు ఫోన్ కేస్‌ను తొలగించండి. ఇలా చేయటం వల్ల ఛార్జింగ్ వేగం మరింత పెరిగే అవకాశముంటుంది.

3. ఫోన్ ఛార్జ్‌లో ఉన్నపుడు గేమ్స్, బ్రౌజింగ్ వంటి యాక్టివిటీలకు దూరంగా ఉండండి. ఛార్జ్ అవుతోన్న ఫోన్‌కు విశ్రాంతి చాలా అవసరం.

4.చాలా మంది తమ ఆండ్రాయిడ్‌లను పవర్ బ్యాంక్ లేదా యూఎస్బీ అవుట్ లెట్స్ ద్వారా ఛార్జ్ చేస్తుంటారు. ఇది సరైన చర్య కాదు. సాంప్రదాయ వాల్ ఛార్జర్ ద్వారా ఆండ్రాయిడ్‌ను ఛార్జ్ చేయటం ద్వారా ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here