అదే పనిగా ఎక్కువ సేపు టీవీ చూస్తున్నారా?

0
87

అదే పనిగా ఎక్కువ సేపు టీవీ చూస్తున్నారా?

అదే పనిగా ఎక్కువ సేపు టీవీ చూడటం అలవాటా? అయితే జాగ్రత్త. గంటల పాటు అదే పనిగా టీవీ చూసే అలవాటు ఉన్నవారిలో రక్తం గడ్డకట్టే అవకాశాలు రెట్టింపు అని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. టీవీ ఎక్కువ సేపు చూసే అలవాటు గుండె జబ్బులకు కారణం అవుతోందని ఇప్పటికే వెల్లడైంది. కానీ కాళ్లు, చేతులు, పొత్తి కడుపు, ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కడుతుందని తేలడం మాత్రం ఇదే తొలిసారి. దీన్నే వీనస్ థ్రోంబోఎంబోలిజం (వీటీఈ) అంటారు.

టీవీ ఒక్కటే చూస్తే ఫర్వాలేదు. కానీ ఆ టైంలో ఏదో ఓ స్నాక్స్ తింటూ కదలకుండా గంటల కొద్దీ కూర్చుండిపోతాం. ఇది చాలా ప్రమాదకరం అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్‌కు చెందిన మేరీ క‌ష్‌మన్ తెలిపారు.

ఇందు కోసం 45 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న 15,158 మందిపై అధ్యయనం చేపట్టారు. టీవీ చూడని వారితో లేదా తక్కువ సేపు చూసేవారితో పోలిస్తే.. ఎక్కువ సేపు చూసేవారిలో వీటీఈ ముప్పు 1.7 రెట్లు అధికమని ఈ పరిశోధనలో తేలింది. శారీరకంగా ఏదో ఒక పని చేసేవారిలోనూ టీవీ చూడటం కారణంగా ఈ ముప్పు ఉండటం గమనార్హం. అమెరికాలో ఏటా మూడు లక్షల నుంచి ఆరు లక్షల మంది వీటీఈ బారిన పడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here